అంగరంగ వైభవంగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిచ్చితార్తం

తాత మాజీ ప్రధానమంత్రి తండ్రి మాజీ ముఖ్యమంత్రి.. కుమారుడు నటుడుగా రాజకీయ నేతగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా నటుడవ్వాలనే ఉద్దేశంతో సినిమా రంగ ప్రవేశం చేశాడు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి తొలి అనుభవమే నిరాశకు గురి చేసింది. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడే మాజీ ప్రధాని దేవెగౌడ మనమడు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్. కర్నాటక బెంగళూరులోని తాజ్ వెస్టెండ్ హోటల్ లో నిఖిల్ నిశ్చితార్థం రేవతితో అతిరథ మహారథుల మధ్య వైభవంగా జరిగింది.

నిశ్చితార్థం అనంతరం ముందుగా తాత దేవెగౌడకు నిఖిల్ రేవతి ఆశీర్వాదం పొందారు. అనంతరం వచ్చిన అతిథులందరూ కొత్త జంటను ఆశీర్వదించారు. నిఖిల్ నిశ్చితార్థ వేడుకకు రాజకీయ నాయకులతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా తరలివచ్చారు. మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. అయితే తన కుమారుడి పెళ్లి గురించి వివరాలు వెల్లడిస్తూ ఆదివారం కుమారస్వామి భావోద్వేగానికి గురయ్యారు.

‘ఈ పెళ్లి పైన నేను అనేక ఆశలు పెట్టుకున్నా. నటుడిగా రాజకీయ నేతగా నా కుమారుడిని ఆశీర్వదించిన వారినందరినీ ఈ పెళ్లికి ఆహ్వానిస్తా. రామనగర–చెన్నపట్టణ మధ్యలో వివాహం నిర్వహిస్తాం. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని ప్రకటించారు. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించనున్నారు.

జాగ్వార్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన నిఖిల్ గత లోక్సభ ఎన్నికల్లో రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ చేతితో పరాజయం పాలైన విషయం తెలిసిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *