అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యధిక కాలం గడిపిన మహిళగా రికార్డు క్రియేట్ చేశారు క్రిస్టీనా కోచ్

ప్రపంచంలో వందల కోట్ల మంది ఉంటారు.కానీ.. అందులో కొందరు మాత్రం చాలా స్పెషల్. ఇప్పుడు చెప్పే మహిళ కూడా ఆ కోవకే చెందిన వారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యధిక కాలం గడిపిన మహిళగా రికార్డు క్రియేట్ చేశారు క్రిస్టీనా కోచ్. అంతరిక్షం లో ఆమె ఏకంగా 328 రోజులు గడిపారు.

తాజాగా ఆమె సోయెజ్ క్యాప్సూల్ ద్వారా సేఫ్ గా కజికిస్తాన్ లో ల్యాండ్ అయ్యారు. ఆమెతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన లూకా పర్మిటానో.. రష్యాకు చెందిన అలెగ్జాండర్ ష్కోవ్రోట్సవ్ లుక ఊడా కోచ్ లు ఉన్నారు. 328 రోజుల అంతరిక్షంలో గడిపిన కోచ్.. సోయెజ్ క్యాప్సూల్ లో నుంచి నవ్వుతూ బయటకు వచ్చారు.

అదే సమయంలో రష్యన్ వ్యోమగామి ఆపిల్ పండు తింటూ కనిపించటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతరిక్షం లో సుదీర్ఘకాలం గడిపిన ఆమె.. సేఫ్ గా భూమి మీదకు ల్యాండ్ కావటం అందరి లో ఆనందానికి గురి చేసింది. గతంలో అంతరిక్షం లో అత్యధిక కాలం (289) గడిపి మహిళా వ్యోమగామిగా ఉన్న పెగ్గి విట్సన్ రికార్డును క్రిస్టీనో కోచ్ బద్ధలు కొట్టినట్లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *