అమ్మో పెద్దయన..

పెద్దాయనా.. ఇదేం పాడు బుద్ధి..!
కొడుకును కనేందుకు వృద్ధుడి పైశాచికం..
అతడు 64 ఏళ్ల వృద్ధుడు.. అప్పటికే ముగ్గురు కుమార్తెలున్నారు. కానీ, ఏదో లోటు.. ఈ వయసులోనూ తన కుటుంబానికి వారసుడిని కనాలనే ఆత్రుత.. అందుకోసం నగరానికి చెందిన ఓ యువతితో కృత్రియ గర్భధారణ పద్ధతిలో కొడుకును కనాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఒక్కసారిగా అతనిలోని మానవమృగం నిద్రలేచింది. యువతితో చేసుకున్న ఒప్పందాన్ని పక్కనపెట్టి తనతో సహజ సిద్ధంగానే పిల్లలను కనాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నివాసముంటున్న స్వరూపరాజ్‌ (64)కు ముగ్గురు ఆడపిల్లలున్నారు. కొడుకు కావాలనే కోరికతో తన తన స్నేహితుడు నూర్‌ని సంప్రదించాడు. అతని సాయంతో కృత్రిమ గర్భధారణ ద్వారా కొడుకును కనేందుకు నగరానికి చెందిన 23 ఏళ్ల యువతితో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాకుండా ఆమెకు ప్రసవం జరిగేంతవరకూ నెలకు రూ. 10 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక రోజు యువతిని స్వరూపరాజ్‌ కలుసుకున్నాడు. అప్పటినుంచి యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఒప్పందం ప్రకారం కాకుండా సహజ సిద్ధంగానే తనతో పిల్లలను కనాలంటూ వేధిస్తూ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. దీంతో బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడు స్వరూపరాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తిరుపతన్న తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *