అర్హులందరికీ ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ :సీఎం జగన్

అర్హులందరికీ ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది

ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ సంబంధించిన కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పంపిణీ చేయడం జరుగుతుంది..
 ఇల్లులేని అర్హులైన ప్రతి ఒక్కరికి నివాస స్థలం పట్టా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  పేర్కొన్నారు. మంగళవారం సచివాలయం నుండి రాష్ట్రంలోని వివిధ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందనపై, 

ఇంటి పట్టాలు , అమ్మ ఒడి, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ నవశకం, దిశ చట్టం అమలు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్య దీవెన, మధ్యాహ్న భోజన పథకం అమలు, మనబడి నాడు- నేడు,పలు సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులు నిర్దేశం చేశారు. రాజధాని నుండి వీడియో కాన్ఫరెన్స్లో
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నుంచి 21 వరకూ కొత్త పెన్షన్‌కార్డులు, బియ్యంకార్డులుపంపిణీ
ఉగాదినాటికి ఇళ్లపట్టాలు మంజూరు 25 లక్షలమందికి మహిళల పేర్లమీద 10 రూపాయల స్టాంపు పేపర్లమీద ఇళ్ల పట్టాల మంజూరులో అర్హులకు అన్యాయం జరిగిందన్న మాట రాకూడదని ముఖ్యమంత్రి తెలిపారు.
నేను గ్రామాల్లో పర్యటించేటప్పుడు.. మీ ఊరిలో ఇంటి స్థలం లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే.. ఎవరు లేదని చెయ్యెత్తకూడదు ముఖ్యమంత్రి తెలిపారు . కులం, మతం, జాతి, వివక్షత అన్నది లేకుండా రాష్ట్రంలోని నిరుపేదల అందరికీ సంపూర్ణ సంతృప్తస్థాయిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.ఫిబ్రవరి 28న విద్యా వసతి దీవెన ప్రారంభంఇప్పుడు మొదటి విడత కింద, జులై– ఆగస్టులో రెండో విడత బోర్డింగు, లాడ్జింగు ఖర్చలుకు ఈ డబ్బు తల్లులకు ఇస్తున్నాందాదాపు 11 లక్షల మందికిపైగా పిల్లలకు ఇది ఇస్తున్నాం తెలిపారు, ఐటిఐ చదివే పిల్లలకు, మొదటి విడత ఐదు వేల రూపాయలు, రెండో విడత 5000 రూపాయలు,పాలిటెక్నిక్ చదివే పిల్లలకు, 7వేల ఐదు వందల రూపాయలు, మొదటి విడత, 2 విడత 7500 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.11వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిగ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే ప్రాజెక్టు ఇది ముఖ్యమంత్రి తెలిపారు. ఇక్కడనాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు, ఎరువులను గ్రామస్థాయిలో రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.రైతు పంటవేసే సమయానికి కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాంపశువులకు కూడా హెల్త్‌ కార్డులు ఇస్తున్నాం,సచివాలయంలో పశువైద్యానికి సంబంధించిన ఉద్యోగులను రైతు భరోసా కేంద్రాల్లో ఉంచుతాం .ఫిబ్రవరి 28న 3,300 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం మార్చిలో మరో 5వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం ఏప్రిల్‌ మొదటి వారం నాటికి మరో 7 వేల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా
మొత్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్‌ నెలాఖరు కల్లా ప్రారంభించడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తున్నాం ముఖ్యమంత్రి తెలిపారు 336 సేవలు కేవలం 72 గంటల్లో పూర్తిచేయాలని నిర్దేశించుకున్నాం. 541 సేవలు ఎన్నిరోజుల్లో అందుతాయో అన్న జాబితా గ్రామ సచివాలయాల్లో డిస్‌ ప్లే చేయాలి కంటివెలుగులో భాగంగా మూడో విడత కార్యక్రమం అవ్వాతాతలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు పది లక్షల మందికి శస్త్రచికిత్స అవసరమని తెలిపారు.
గ్రామ స్థాయిలో స్క్రీనింగ్‌ ఫిబ్రవరి 1 నుంచి వైయస్సార్‌ కంటి వెలుగు మూడో విడత
ఫిబ్రవరిలో 4,906 కొత్త సబ్‌సెంటర్ల నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు
మధ్యాహ్న భోజనం నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు తెలిపారు. జిల్లా కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి పరిశీలన చేయాలి ముఖ్యమంత్రి తెలిపారు . వైఎస్సార్ రైతు భరోసా పథకం క్రింద 46.50 లక్షల కుటుంబాలకు రూపాయలు 6, 299 కోట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి జిల్లాలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ పక్రియ, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక చేయూత పై ఆరా తీశారు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *