ఆడియెన్స్ ని గిలిగింతలు పెడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి

కొంటెతనం కవ్వించే అందాలతో ఆడియెన్స్ ని గిలిగింతలు పెట్టేయడంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తర్వాతనే. కెరీర్ ఆరంభంమే గ్లామర్ గేట్లు తెరిచేసిన ఈ కుర్రబ్యూటీ ఆ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.
సాధ్యమైనంత వరకు తనని అభిమానించే వారికి.. జనరల్ ఆడియెన్స్ కి సంతృప్తి పడేంతగా.. అందాల ట్రీటిస్తోంది. దీంతో నిధి అప్ డేట్స్ కోసం ఆమె అభిమాన నెటిజనం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు.
ఎప్పుడెప్పుడు కొత్తందంతో కవ్విస్తుందో అన్న ఆసక్తి కనిపిస్తుంది.
ఫ్యాన్స్ ని అలరించాలనేఉద్దేశ్యంతో నిధి కూడా సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ఎకౌంట్స్ ఇన్స్టా- ట్విట్టర్స్ లో ఆరబోత ఫోటోలను పంచుకుంటోంది. తాజాగా ఈ సెక్సీ భామ కొత్త ఫోటో షూట్ కి సంబంధించిన రెండు ఫోటోలను పంచుకుంది.
అందులో పర్పుల్ కలర్ స్కార్ఫ్ ని వేసుకుని.. పై అందాలను ఎలివేట్ చేసింది. లైట్ పింక్ కలర్ టాప్- జీన్స్ ప్యాంట్ తో కొంటెగా పోజులిచ్చింది. ఆమాయకత్వం…
కొంటెతనం నిండిన చూపులతో ఉన్న ఫోటోలు ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి.

దీంతో ఆమె ఫోటోలకు లక్షల్లో లైక్స్ వచ్చాయి. చాలా మంది నెటిజనులు నిధిపై ప్రేమను కురిపించారు. సో క్యూట్.. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్నావు.. సూపర్ సెక్సీ.. వెరీ సెక్సీ లుక్ యార్ అంటూ లవ్ ఎమోజీలను పంచుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు వల్గర్ గానూ కామెంట్స్ వినిపించాయి. `ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ తో క్రేజీ బ్యూటీగా మారిన నిధి అటుపై సౌత్ అన్ని భాషలకు సంతకాలు చేస్తోంది.

ఇటు తెలుగులో ఆఫర్స్ అంతంత మాత్రమే. ఆ క్రమంలోనే తమిళం- కన్నడలోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఒకేసారి తమిళంలోకి.. కన్నడలోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో అశోక్ గల్లా చిత్రంలో.. తమిళంలో `భూమి` అనే సినిమాలో.. కన్నడలో `జేమ్స్` అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. దీంతోపాటు తెలుగులో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ ల కోసం నిధితో చర్చలు జరుగుతున్నాయి. వాటిపై త్వరలో క్లారిటీ వస్తుందని చెబుతుంది నిధి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *