ఆల మళ్ళీ సందడి..

గత నెలలో సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం అప్పుడే ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఇంకా కొన్ని థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో అప్పుడే ఆన్ లైన్ స్ట్రీమింగ్ అంటే థియేటర్ల మీద దెబ్బ కొట్టినట్లే అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై సన్ నెట్ వర్క్ వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అయ్యారు.

ఈనెల 26వ తారీకు నుండి సన్ నెక్ట్స్ లో ఈ సినిమాను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతారు. ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న ఈ చిత్రం ఆన్ లైన్ లో కూడా సెన్షేషన్ క్రియేట్ చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తానికి సన్ నెక్ట్స్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా డబ్ చేసి ఈ సినిమాను సన్ నెక్ట్స్ లో ఉంచబోతున్నారట.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో నాన్ బాహుబలి రికార్డును దక్కించుకుంది. ఇండస్ట్రీ కొట్టిన ఈ చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. కనుక సన్ నెక్ట్స్ లో మలయాళంలో కూడా స్ట్రీమ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆన్ లైన్ లో పూర్తి అయిన తర్వాత టీవీల్లో కూడా ఈ సినిమా ప్రసారం కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *