ఆస్తి కోసమే అమృత డ్రామాలు : అమృత బాబాయ్

తండ్రి మారుతీరావు ఆస్తి కోసమే అమృత డ్రామాలు ఆడుతుంది అని మారుతీరావు తమ్ముడు శ్రవణ్ అమృత పై సంచలన ఆరోపణలు చేసారు. తండ్రిని కడసారి చూడటానికి వెళ్లిన అమృతాన్ని బంధువులు సన్నిహితులు అడ్డుకోగా తండ్రి శవాన్ని చివరి చూపు కూడా చూసుకోకుండా అమృత అక్కడినుండి తిరిగివచ్చింది. ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ ..బాబాయ్ శ్రవణ్ పై పలు సంచలన ఆరోపణలు చేసింది. మా అమ్మ కి బాబాయ్ నుండి ప్రాణ హాని ఉందని డబ్బు కోసం తన తండ్రిని బాబాయ్ ..ఎదో చేసాడు అన్నట్టుగా ఆరోపణలు చేసింది.

అమృత ఆరోపణలపై స్పందించిన మారుతీరావు తమ్ముడు శ్రవణ్ ..తనపై అమృత చేసిన ఆరోపణలను మారుతీరావు సోదరుడు శ్రవణ్ ఖండించారు. డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. నిన్నటి వరకు మారుతీరావును ఉరితీయాలని అమృత డిమాండ్ చేసిందని కానీ ఇప్పుడు డబ్బు కోసం తనపై అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు.

ప్రణయ్ హత్యకు ముందు నుంచే మారుతిరావుతో అమృతకు మాటల్లేవని తెలిపారు. అమృత విషంలోనే గొడవలు తప్ప తన అన్నకు తనకు ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి సమస్యలు లేవని శ్రవణ్ చెప్పారు. మారుతీరావుకు చెందిన ఒక్కపైసా కూడా తనకు అవసరం లేదన్నారు. తన సోదరుడు పోయాక ఆయన వెనకాల ఉన్న ఆస్తిపై ప్రేమ పుట్టుకొచ్చిందని.. డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతుందని ఆయన ఆరోపించారు. అలాగే అన్నయ్య చనిపోయిన సమయంలో అమృత తీరు మమ్మల్ని ఎంతో బాధించింది. నేను మా అన్నయను బెదిరించానని ఆరోపిస్తోంది. నా వల్ల ప్రాణహాని ఉందనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు అని తెలిపారు.

అమృత చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయని ఆయన మండిపడ్డారు. నాన్న అని పిలవడానికి కూడా ఆమెకు మాటలు రాలేదని తల్లి మీద ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదని శ్రావణ్ అన్నారు. వాళ్ల అమ్మ దగ్గరకు వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా చెప్పారు. మీడియాలో కనిపించడం కోసం డ్రామాలు. వాళ్ల అమ్మ దగ్గరకు వస్తే నాకేం అభ్యంతరం లేదు. అన్యాయంగా నన్ను జైలుకు పంపించారు. మళ్లీ ఇప్పుడు నా పై ఆరోపణలు చేస్తోంది. దయచేసి మీడియా కూడా అవాస్తవాలు రాయొద్దు. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఒకవేళ మా అన్న ఎవరికైనా అప్పు ఉంటే వాటిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *