ఆ సింగర్ ను అంతలా వేధించారట

కన్నడ వర్తమాన సింగర్ సుష్మిత సోమవారం నాడు తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ కట్టుకున్న భర్త తో సహా అత్త మామలు రోజు వేధిస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె ఆత్మహత్యకు ముందు తన తమ్ముడికి వాట్సాప్ మెసేజ్ పంపారు. తమ్ముడికి మెసేజ్ చేసిన తరువాత బెంగళూరు నాగరబావి ప్రాంతంలోని ఇంటిలో ఆమె ఉరి వేసుకుని చనిపోయారు.

ఇకపోతే సింగర్ సుస్మిత ..కన్నడ సినిమా సీరియల్స్ స్టేజ్ షోలలో పాటలు పాడి కన్నడ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్తమాన సింగర్ ఎలా హఠాత్తుగా ఆత్మహత్యకి పాల్పడటంతో ..ఈ వార్త కన్నడ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సుస్మిత తన తమ్ముడికి పంపిన మెసేజ్ లో “అమ్మా నన్ను క్షమించు నా భర్త వాళ్ల బంధువులు నన్ను మానసికంగా చిత్ర హింసలు పెడుతున్నారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. నా తప్పునకు నేనే శిక్ష అనుభవిస్తున్నా నా మరణానికి భర్త శరత్తో పాటు ఇతర బంధువులు వైదేహి గీతలే ప్రధాన కారణం. పెళ్లయిన ఏడాదిన్నర నుంచి కష్టాలు అనుభవిస్తున్నా నన్ను వేధించిన ఎవ్వరినీ వదలొద్దు అని అమ్మా మిస్ యూ.. నీ కోసం తమ్ముడు సచిన్ ఉన్నాడు. వాడిని బాగా చూసుకో నా సూసైడ్ లెటర్ ని అమ్మకు చూపించు తమ్ముడు అంటూ ఆమె మెసేజ్ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనితో తమ కూతురు మరణానికి భర్త అత్తమామలే కారణమని సుష్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఆమె సూసైడ్ లెటర్ ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *