ఇండియన్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్ …ఏంటంటే !

అగ్రరాజ్యం అధినేత ప్రపంచ దేశాల పెద్దన్న ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ..భారత్ పర్యటనకి వచ్చి తిరిగి వెళ్లిన వారం రోజులకే భారతీయులకి పెద్ద షాక్ ఇచ్చారు. ట్రంప్ భారత్ పర్యటనకి వచ్చిన ట్రంప్ .. భారత్ ప్రభుత్వం పై ప్రధాని మోడీ పై అమెరికా ..భారత్ మైత్రి పై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ట్రంప్ నోటి నుండి ఏదైనా సానుకూల ప్రకటన వెలువడబోతుందా అని ఎదురుచూస్తున్న నేపథ్యంలో ..ట్రంప్ మరోసారి తన సహజశైలిలోనే మరో షాక్ ఇచ్చారు.

అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ భాద్యతలు తీసుకున్నప్పటి నుండి సంచలన వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలలో ఎక్కువగా అమెరికా వెళ్లాలని అక్కడ ఉద్యోగం చేయాలనీ కలలు కనే వారికి ఆందోళన కలిగించేవే ఎక్కువ. ఇక మొన్నటి వరకు ట్రంప్ తన దృష్టి మొత్తం హెచ్1బీ హెచ్ 4 వీసా మార్పుల పైనే పెట్టారు. అయితే తాజాగా ఈ కేటగిరిలో ఈబీ-5 వీసా కూడా వచ్చి చేరింది. అసలు ఈబీ-5 వీసా అంటే .. యూఎస్ ఇన్వెస్టర్ వీసా. ఈ వీసా కింద అమెరికా వెళ్లి అక్కడ అవకాశాల కోసం వెతికేవారు.

అయితే తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం తో ఇకపై ఈ ఈబీ – 5 వీసా రేటు కూడా భారీగా పెరగనుంది. ఈ వార్త భారతీయులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ అదనపు చార్జీ అన్ని రకాల వీసాలపై ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రధానంగా ఇబి -5 వీసా ద్వారా అమెరికా లో వ్యాపారం చేసేందుకు వచ్చే భారతీయులకు తీవ్ర అవరోధాన్ని సృష్టిస్తుంది. ఒక రకంగా అమెరికా గ్రీన్ కార్డు పొందాలి అంటే .. ఈ వీసాను ఒక రాజ మార్గంగా భావిస్తుంటారు.

మారిన నిబంధనలకు అనుగుణం గా ..ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ‘ఈబీ-5’ వీసా పొందేందుకు భారతీయులు 5 శాతం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీని కింద పెట్టుబడి మొత్తాన్ని పెంచినట్టు అమెరికా గత నవంబర్ నెలలోనే ప్రకటించింది. అమెరికా లీగల్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ‘ఈబీ-5’ ఇన్వెస్ట్ మెంట్ వీసా ప్రోగ్రాంలో పెట్టుబడి మొత్తాన్ని గత ఏడాది 9 లక్షల డాలర్లకు పెంచింది. 1990 తర్వాత పెంచడం ఇదే తొలిసారి. కనీస పెట్టుబడి లో ఈ పెరుగుదల తో పాటు కొత్త 5 శాతం అదనపు పన్ను అంటే దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ప్రమాణాన్ని నెరవేర్చడానికి అమెరికాలోని ఎస్క్రో ఖాతా కు డబ్బును తరలించినప్పుడు అదనంగా మరో 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈబీ5 వీసాలను పొందుతున్న వారి లిస్టులో భారత్ మూడవ స్థానంలో ఉండగా చైనా వియత్నాం దేశాలు ఆ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *