ఇండియన్ 2 యాక్సిడెంట్ స్పందించిన బన్నీ..

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 చిత్రం షూటింగ్ లో భారీ క్రేన్ కుప్పకూలి ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందగా దర్శకుడు శంకర్ తో పాటు పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటన ఇండియన్ సినీ పరిశ్రమనే కుదిపేసింది. సినీ ప్రేమికులు మరియు అన్ని భాషల సినీ ప్రముఖులు ఉలిక్కి పడేలా చేసింది. శంకర్ దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న దర్శకుడు అవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

తాజాగా అల్లు అర్జున్ ఈ యాక్సిడెంట్ గురించి స్పందించాడు. ట్విట్టర్ లో.. ఇప్పుడే యాక్సిడెంట్ గురించి తెలిసింది. చాలా భయంకరమైన సంఘటన. హృదయం ద్రవించి వేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇంకా పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ యాక్సిడెంట్ గురించి స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *