ఇన్ సైడర్ ట్రేడింగ్..సీఐడీ సోదాలు..పరారీలో టీడీపీ నేతలు?!

ఏపీ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వ్యవహారంపై సీఐడీ – సిట్ ల విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ కోసమని రాజధాని భూముల వ్యవహారంలో పాత్రధారులైన వ్యక్తుల ఇళ్లపై సిట్ – సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ నేతల సంబంధీకుల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. మరి కొందరు ఈ విషయంలో సిట్ లిస్టులో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం నేతలు పరారీలో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉండటం గమనార్హం!
ఈ జాబితాలో నన్నపనేని లక్ష్మినారాయణ పేరు వినిపిస్తూ ఉంది. ఈ టీడీపీ సీనియర్ నేత పరారీలో ఉన్నారనే టాక్ వస్తోంది. ఈ సన్నపనేని లక్ష్మినారాయణ మరెవరో కాదు.. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏజీగా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ కు సొంత మామేనట! అలాగే ఈ లక్ష్మినారాయణ తనయుడు సీతారామారాజు తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం సబ్ కాంట్రాక్టర్లలో ఒకరని తెలుస్తోంది.

ఇప్పటికే వీరి ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో లక్ష్మినారాయణ తన ఇళ్లకు తాళాలు వేసుకుని పరార్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ కీలక నేత – మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధుగణం ఇళ్లలో కూడా సీఐడీ – సిట్ అధికారుల సోదాలు జరిగాయి. అయితే ఇంకా సోదాలు జరగాల్సి ఉందని సమాచారం. కొందరు తెలుగుదేశం నేతలు పరారీలో ఉన్నారని – సెర్చ్ వారెంట్లు జారీ చేసినట్టుగా – వారి ఇళ్లలో సోదాలకు కూడా నోటీసులు జారీ చేసి – తలుపులకు అతికించినట్టుగా అధికారులు పేర్కొన్నారు. వీరంతా అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రకటన రాకముందే భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారనే అభియోగాలు వినిపిస్తూ ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *