ఇలియానా బికినీయిజం కేరాఫ్, గోవా పాలెం బీచ్లో !!

గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ పేరు తెలియనివారు తెలుగు సినిమా ప్రేమికులు అని చెప్పుకునేందుకు అనర్హులని తేల్చేయవచ్చు. ఎందుకంటే తెలుగులో ఉండే టాప్ స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడి హిట్లు కూడా సాధించింది. ఇప్పుడంటే టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయింది కానీ ఒక దశలో ఇల్లీ ఇక్కడ స్టార్ హీరోయిన్. ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ లోనే మకాం. బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ కూడా అయింది కాబట్టి సింగిల్ గా రెచ్చిపోతోంది. ఫోటోషూట్లతో సోషల్ మీడియాకు సమ్మర్ ను త్వరగా తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉంది.

ఇల్లీ బేబీ ఈమధ్య తన గోవా బీచ్ సంప్రదాయం కొనసాగిస్తూ ఓ కత్తి లాంటి ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోషూట్ లో తెలుపు రంగు బికినీ.. పైనేమో అత్యంత పారదర్శకంగా ఉండే ఉల్లిపొర లాంటి వైట్ టాప్ ధరించి గ్రీకుదేవత తరహాలో నిలుచుంది. గాలికి ఎగురుతున్న జుట్టును సరిచేసుకుంటున్నట్టుగా ఒక చేతిని తలపై పెట్టుకుంది. చేతికి రిస్ట్ బ్యాండ్ తో పాటుగా ఏదో రాగి కడియం లాంటిది కూడా ధరించింది. ఆ పోజు.. సైడ్ యాంగిల్ లో ఒంపులు చూస్తుంటే ఎలాంటి స్త్రీద్వేషి అయినా గోవా పాపకు వీరాభిమాని గా మారిపోవాల్సిందే. నిద్రలో కూడా ఇల్లీ ఇల్లీ అని కలవరించాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *