ఈతకొలనులో పటౌడీ వారసులు

సీనియర్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్. ‘కేదార్ నాథ్’.. ‘సింబా’ సినిమాలతో సక్సెస్ సాధించింది. అయితే ఈమధ్య రిలీజ్ అయిన ‘లవ్ ఆజ్ కల్’ మాత్రం నిరాశ పరిచింది. సారా అలీ ఖాన్ ఈ జెనరేషన్ స్టార్ కిడ్ కదా.. అందుకే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

ఈరోజు తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “హ్యాపియస్ట్ బర్త్ డే బ్రదర్. నేను నిన్నెంత ప్రేమిస్తానో నీకు తెలియదు. ఈరోజు నిన్ను నేను మిస్ అవుతున్నా. నీతో ఉంటే బాగుండేది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో స్విమింగ్ పూల్ నీటిలో సారా నిలుచుని ఉంటే.. గట్టుమీద సారా తమ్ముడు ఇబ్రహీమ్ అలీ ఖాన్ నిలుచుని ఉన్నాడు. ఇబ్రహీం నాన్న సైఫ్ స్టైల్ లోనే కనిపిస్తున్నాడు. అక్క తమ్ముడు ఇద్దరూ ఈత దుస్తులలో స్టైల్ గా పోజివ్వడం విశేషం.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి భారీ స్పందనే దక్కింది. చాలామంది ఇబ్రహీమ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొందరేమో ఇలా స్విమ్మింగ్ డ్రెస్సుల ఫోటో కాకుండా సాధారణ ఫోటో పోస్ట్ చేసి తమ్ముడికి బర్త్ డే విషెస్ తెలిపితే బాగుండేది కదా.. అంటూ సలహాలిచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే సారా ‘కూలీ నెం.1’.. ‘అత్రంగి రే’ అనే సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు 19 ఏళ్ళ వయసున్న ఇబ్రహీమ్ కూడా త్వరలో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని టాక్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *