ఈ.సి తీరును తప్పుపట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి

ఉదయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి. ఎంపీ
– ఎన్నికల కమిషనర్ కు ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం నిష్పాక్షికత
– ఆ నిష్పాక్షికతతో పాటు శ్రీ రమేష్ కుమార్ విచక్షణను కూడా కోల్పోయినట్టుగా… అధికారులు మాత్రం కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలి.

శ్రీ రమేష్ కుమార్ చెబుతున్నట్టు రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎక్కడైనా విఘాతం కలిగితే,
చెదురుమదురుగా కొన్ని సంఘటనలు జరిగితే.. ఆ సంఘటనల మీద సంబంధిత ఎస్పీలు,
కలెక్టర్లు నిష్పాక్షికంగా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేకించి కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నామంటూ.. చెప్పారు.
– ఆరు వారాలు వాయిదా వేస్తున్నామన్నారు. మరి కరోనా నేపథ్యంలో వాయిదా అంటూనే
రమేష్ కుమార్ గారు రాజకీయ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కారు…?

గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలను, మరికొంతమంది అధికారులను, మాచర్ల సీఐని
తప్పిస్తున్నామన్నారు.
-కరోనా వల్ల వాయిదా అంటూనే.. ఈ చర్యలు ప్రకటించడం ద్వారా సాకు కరోనా అయినా..
అసలు అజెండా వేరే ఉందన్న అభిప్రాయం కలిగించారు.

కొన్నిచోట్ల బెదిరింపులకు దిగటం దారుణం అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో శాంతిభద్రతలకు
విఘాతం కలిగించింది చంద్రబాబే..
– మూడు రాజధానుల ప్రకటన నాటి నుంచి ప్రజలను దుర్మార్గంగా రెచ్చగొట్టిందీ చంద్రబాబే..
– 25 లక్షల ఇళ్ళ పట్టాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలకు ఇవ్వకుండా
అడ్డుకోవాలన్న చంద్రబాబు వ్యూహానికి రమేష్ కుమార్ చర్యలు పరోక్షంగా సహకరిస్తున్నాయి.

ఎన్నికలలో హింస చెలరేగిన సందర్భాల్లో.. రీపోలింగ్ నిర్వహించటం లేదా.. దిద్దుబాటు 

చర్యలు తీసుకోవటం చూశాంగానీ.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని అడ్డుకునేలా ఎన్నికల
ప్రక్రియను నిలిపివేయటాన్ని ఎక్కడా చూడలేదు.

రాష్ట్రంలో ఇంతవరకూ ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు.
– ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్న విషయం ఈరోజు ఎల్లో మీడియా మొదటి పేజీ
చూసినా అర్థమవుతోంది.

ఈసీ ఉన్నది ప్రజాస్వామ్య పరిరక్షణకా.. లేక.. ఈసీ స్థానంలో ఉన్న వ్యక్తి తనను
నియమించినవారి రుణం తీర్చుకోవటానికా.. అన్నది రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి.

మనకు రావాల్సిన 5వేల కోట్ల రూపాయలు రాకపోతే.. ఇక్కడ ప్రజల మీద పడే ప్రభావాన్ని
రమేష్ కుమార్ ఎందుకు పరిగణల్లోకి తీసుకోలేదో కూడా ఆలోచించాలి.

ఈసీ వ్యాఖ్యలు తెలుగుదేశం తదుపరి కార్యాచరణకు ఒక రంగం సిద్ధం చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *