ఈ హాటీకి రాములమ్మ ఆదర్శమట

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. మొదటి సినిమాతో మంచి సక్సెస్ ను దక్కించుకోవడం తో పాటు నటిగా కూడా మంచి పేరు దక్కించుకుంది. అందుకే ఈ అమ్మడు అప్పటి నుండి చాలా బిజీగా సినిమాలు చేస్తూనే ఉంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్.. తెచ్చిన పేరుతో ఇప్పటి వరకు కెరీర్ ను నెట్టుకు వస్తూనే ఉంది. మరో సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం 5Ws అనే సినిమాను చేస్తోంది.

5Wsచిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్గా పాయల్ కనిపించబోతుందట. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పాయల్ చిత్రంలో కనిపించబోతుందని ఫస్ట్లుక్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇప్పటి వరకు కమర్షియల్ పాత్రలు చేసిన పాయల్ మొదటి సారి పూర్తి విరుద్దమైన సీరియస్ పాత్రను ఇందులో చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా సినిమా ప్రెస్ మీట్ లో తన పాత్ర గురించి పాయల్ రాజ్ పూత్ చాలా గొప్పగా చెప్పుకొచ్చింది.

ఈ సినిమాలో తాను నటించేందుకు గాను లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారిని ఆదర్శంగా తీసుకున్నాను. ఆమె పోలీస్ స్టోరీలతో చేసిన సినిమాలను చూశాను. ఆ సినిమాలు నాకు ఆదర్శంగా నిలిచాయంది. గ్లామర్ హీరోయిన్ గా ఇన్ని రోజులు పేరు దక్కించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సీరియస్ పాత్రతో తన ఇమేజ్ ను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరి 5Ws చిత్రంతో ఆ ప్రయత్నం సఫలం అయ్యేనా చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *