ఊపులో ఉన్నపుడు అవకాశం ఉండే పాత్రలు ఎంచుకోలేక పోయా :రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్.. తెలుగులో ఒకప్పుడు తన అందచందాలతో ఓ ఊపు ఊపిన అందాల నటి. ఈ భామ ఇటూ తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ, తమిళ సినిమాల్లోను నటిస్తూ అదరగొట్టింది. తెలుగు తెరకు ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లో నటించి మొదటి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఎప్పుడూ సమయం అనుకూలంగా ఉండదు కదా.. ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో అవకాశాలు జోరుగా వస్తాయనుకుంటే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. మెగా హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నా, ఆ పేరు అవకాశాలను తెచ్చి పెట్టలేదు. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన రకుల్.. తనకు అవకాశాలు రాకుండా పోవడానికి కారణం ఎంటో చెప్పింది. ఆమె వివరిస్తూ.. తాను వరుసగా గ్లామర్ పాత్రలను చేస్తూ.. అందాలను ఆరబోయటమే పెద్ద తప్పయి పోయిందని తెలిపింది. తాను మంచి ఊపులో ఉన్నప్పుడు నటనకు ఆస్కారం ఉండే పాత్రలను ఎంచుకోలేకపోయానని, అదే తనకు ఇప్పుడు అవకాశాలు లేకుండా చేసిందని అభిప్రాయపడింది. ఆమె ఇంక మాట్లాడుతూ.. తాను నిర్మాతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, అనుకున్న సమయానికే షూటింగ్ కు వెళ్లేదాన్నని పేర్కోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *