ఎం ఎల్ ఏ పెద్దారెడ్డి ఒక రోజు ప్రచారం కు దూరంగా ఉండాలన్న ఎలక్షన్ కమిషన్

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్య తీసుకుంది..
తాడిపత్రి శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ఒక రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశలు జారీచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్..

రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో మార్చి 8 వతేదీన స్థానిక శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీ పరిధిలో చీరలు, బట్టలు పంచిపెట్టినట్లు ఫీర్యాదు రావడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు.

ఈ సంఘటన పై ఎన్నికల సాధారణ పరిశీలకులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తాడిపత్రి మునిసిపాలిటీ లోని శ్రీరాముల పేటలో వాకబు చేసి, వాస్తవాలను నిర్ధారించడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి రాష్ట్రంలో 7వ తెది నుండి అమల్లోకి వచ్చినందున , ఓటర్లు ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయ్యడం తీవ్రంగా పరిగణించడ మైనదని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన కింద ప్రాసిక్యూషన్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి మార్చి 15 న ఒక రోజు ఎన్నికల ప్రచారం లో పాల్గొనకుడదని ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *