ఎన్టీఆర్‌ పాడుతున్న ..తెలుగు ‘కుట్టి స్టోరీ’ పాట

లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘మాస్టర్‌’. అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఆయన సంగీతంలో ఇటీవల ‘కుట్టి స్టోరీ..’ అనే సింగిల్‌ ట్రాక్‌ను విడుదల చేశారు. విజయ్‌ పాడిన ఈ పాట ఊహించని స్థాయిలో ప్రేక్షకాధరణ పొందుతోంది. ముఖ్యంగా విజయ్‌ అభిమానులు దీన్ని వైరల్‌గా మార్చారు. పొడి పొడి ఆంగ్ల పదాలు, అందుకు తగ్గ బాణీతో రూపొందించిన ఈ పాట చిన్నారులను ఆకట్టుకుంటోంది. విజయ్‌ నటించిన చిత్రాలు కొంత కాలంగా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. అందులో భాగంగా ‘మాస్టర్‌’ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయాలని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో విజయం పాడిన ఈ ‘కుట్టి స్టోరీ..’ పాటను తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ పాడనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల దీనికి సంబంధించి ఆయనతో చిత్రవర్గాలు చర్చించాయని, అందుకు తారక్‌ కూడా అంగీకరించారని సమాచారం. మరో వైపు విజయ్‌ అభిమానులు దీనిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *