ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.

 

రాష్ర్ట విద్యాశాఖమంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ఎన్నికలు అధికారి రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు.

ఎన్నికలు వాయిదా వేస్తూ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు..ఆది ఎవరు ఇచ్చారు అన్నారు. ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.

కమీషనర్ కు అధికారాలు ఎక్కడనుంచి వచ్చాయి.ఎన్నికలు వాయిదా వేయడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు.ఎన్నికల షెడ్యూల్ గవర్నర్ చేత ఆమోదింపపడింది.దానిని కూడా గౌరవించలేదు.ఎన్నికల కమీషనర్ రాజ్యాంగ వ్యవస్దలను కాలరాశారు.అధికారయంత్రాంగాన్ని సైతం తుంగలో తొక్కి నిర్ణయం తీసుకున్నారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెండు ఆర్టికల్స్ ను కోడ్ చేశారు.

తనకున్న ప్లీనరీ పవర్స్ ను ఉంటంకిస్తూ నోటిపికేషన్ జారిచేయడం జరిగింది.రమేష్ కుమార్ ఈ నిబంధనలన్నింటిని కూడా చూశారోలేదో మాకు తెలియడం లేదు.

కరోనాపై విద్యాశాఖపరంగా మేం విద్యావ్యవస్ధలోని అందరికి మార్గదర్శకాలు ఇచ్చాం.వీటన్నింటిని వారు చూశారాలేదా,సమీక్షనిర్వహించారా లేదో తెలియడం లేదు.రాజ్యాంగం ఆర్డికల్ 324 లో కూడా ఎన్నికలు గురించి చాలా స్పష్టంగా చెప్పింది.అందులో ప్లీనరీ పవర్ మాత్రమే ఉంది.విచక్షణాధికారం కాదు.

ప్లీనరీ పవర్స్ తో ఏ నిర్ణయం అయినా తీసుకుంటారా.రమేష్ కుమార్ నిర్ణయంతో స్ధానికసంస్ధలు నిర్వీర్యం.ఇప్పటికైనా రమేష్ కుమార్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి.వాస్తవానికి వారం రోజులు ఆగితే ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేది.దురుద్ధేశ్యంతో కుట్రపూరితంగా ఎన్నికలు వాయిదా వేసినట్లు కనిపిస్తోంది.

మీకు మీరే రాజుగా ప్రకటించుకుని వాయిదా వేస్తామంటే కుదరదు.ఆర్టికల్ పరిధిలోకి మీరు తీసుకున్న నిర్ణయం రాదనేది రేపు తేటతెల్లమవుతుంది.స్దానికసంస్దలను బలోపేతం చేయాలన్నదే శ్రీ వైయస్ జగన్ గారి లక్ష్యం.

ఆర్టికల్ 324ఫస్ట్ టైం లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ లో వాడారు.పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని ఒక్కరోజు ముందుగా ముగించాలని ఆదేశాలు ఇచ్చారు.అది కూడా లా అండ్ ఆర్డర్ సమస్య నేపధ్యంలో తీసుకున్నారు.తమిళనాడులో వెల్లూరు ఎన్నికల సమయంలో దానిని వాడటం జరిగింది.డబ్బులు పంపిణి నేపధ్యంలో అలా చేశారు.ఇందపెద్దఎత్తున ఎన్నికల షెడ్యూల్ అంతా వాయిదా వేయడం ఎక్కడా జరగలేదు.

చిన్నసాకు అది కూడా కరోనా అని.

రమేష్ కుమార్ గారు2016 ఏప్రిల్ లో వచ్చారు.మీకు ఏమి ధీమా వచ్చిందో మాకు అర్ధం కావడం లేదు.చంద్రబాబుపై గురుభక్తిని చాటుకోవాలనే ఆలోచన వచ్చినట్లు ఉంది.చంద్రబాబూ ..మీకు అభ్యర్దులు లేరు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా పలు స్దానాలను కైవసం చేసుకుందని కడుపుమంటగా ఉన్నట్లుగా ఉంది.ఆ కడుపుమంట రమేష్ కుమార్ గారి ద్వారా తీర్చుకున్నట్లు ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *