ఎమ్మార్వో వనజాక్షి పై దాడి..

విజయవాడ రురల్ కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో భూసేకరణ కోసం నిర్వహించిన సమావేశం తీవ్రఉద్రిక్తతలకు దారి తీసింది. తమ వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాల కోసం సేకరించొద్దంటూ తహసీల్దార్ వనజాక్షిని గ్రామస్తులు కోరారు. అయితే ఈ క్రమంలోనే ఎమ్మార్వో వనజాక్షి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలని అన్నారు. దీనితో గ్రామస్తులకు ఆమెపై మండిపడ్డారు. మమ్మల్ని బ్రోకర్లంటారా అంటూ వనజాక్షిపై దాడికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఆమె అక్కడినుండి వెళ్లిపోవడానికి బయటకి రాగా – ఆమెను మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు – ఎమ్మార్వో వనజాక్షిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.అయితే ఎమ్మార్వో తీరుపై గ్రామస్థులు మండిపడ్డారు. ఎమ్మార్వో పై స్థానిక ఎమ్మెల్యే – కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇకపోతే కృష్ణాజిల్లాలో ఆమధ్య ఇసుక తవ్వకాల విషయంలో వనజాక్షి-చింతమనేని ప్రభాకర్ వివాదం అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ వివాదంపై చంద్రబాబునాయుడు వేసిన కమిటి వనజాక్షి తప్పులేదని తేల్చింది. దీనితో మాజీ ఎమ్మెల్యే పై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అని అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక తవ్వకాల్లో భాగంగా కృష్ణాజిల్లాలోకి అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదులురాగ ఆ విషయమై పరిశీలించమని కలెక్టర్ ఆదేశిస్తే ఎమ్మార్వో వనజాక్షి తవ్వకాలు జరుగుతున్న స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారని గమనించి అడ్డుకోబోయారు. దాంతో ఎమ్మెల్యే – అనుచరులు వనజాక్షిపై దాడి చేసారు. అప్పట్లో ఆ ఘటన రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.దీనితో అప్పట్లో ఎమ్మార్వో వనజాక్షి పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *