ఏపీ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడేందుకు ఏపీపీసీసీ ప్రెసిడెంట్ శిలాజానాథ్ చిరు తో మంతనాలు

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు తహతహలాడుతోంది. రాష్ట్ర విభజన జరిగిన ఆరున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పార్టీని ప్రజలు గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శైలజానాథ్ వచ్చారు. అయితే ఆయన పార్టీ పటిష్టతకు ఏమేం చేయాలో కసరత్తు చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చిరంజీవి విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

చిరంజీవి ని మళ్లీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారని.. ఆయన వచ్చి పార్టీలో కీలక బాధ్యతలు తీసుకుంటారని ప్రకటించారు. చిరంజీవి రాకతో పార్టీలో మళ్లీ కొత్త ఉత్సాహం వస్తుంది అని తెలిపారు. దీంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే చిరంజీవి వస్తారని ప్రకటించడంతో అందరూ షాక్ క్ గురయ్యారు. ఎందుకంటే చిరంజీవి అనధికారికంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తవడానికి ఈజీగా మూడేళ్లు పడుతుంది. మరి ఈ సమయంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి సమయం ఎక్కడ కేటాయిస్తారని అందరూ సంశయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే శైలజానాథ్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయనే చిరంజీవిని పరోక్షంగా పార్టీలోకి తిరిగి రండి.. మీ రాకతో పార్టీ కార్యకర్తలు నాయకులకు ఉత్సాహం వస్తుందని చెప్పకనే చెప్పారని తెలుస్తోంది. పని బట్టుకుని చిరంజీవిని పార్టీలోకి తీసుకువచ్చేలా ఆయన ఉన్నట్లు వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే చిరంజీవిని తిరిగి రాజకీయాల్లోకి లాగితే వచ్చే ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి. అయితే చిరంజీవి మాత్రం కొంత అధికార పక్షం వైపు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవల మూడు రాజధానుల అంశం తో పాటు దిశ చట్టాన్ని స్వాగతించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న వికేంద్రీకరణ బిల్లుకు మద్దతు తెలిపిన చిరంజీవి మళ్లీ పార్టీలోకి ఎలా వస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు యూపీఏ-2 చిరంజీవి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ తింది. ఇప్పట్లో కోలుకునే స్థితిలో ఆ పార్టీ లేదు. ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లోకి వెళ్లాడు.

ఖైదీ నంబర్ 150 తో పాటు సైరా సినిమాలు వరుసగా చేశారు. దీంతో అధికారం ఉన్నప్పుడు ఒకలా అధికారం లేనప్పుడు మరోల చిరంజీవి వ్యవహారం ఉందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ఆయన పై ఉందని నాయకులు గుర్తుచేస్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఇప్పుడు మరో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరీ మళ్లీ పార్టీలోకి ఎలా వస్తారో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *