ఏ పి లో ఎన్నికల కోలాహలం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత… స్థానిక ఎన్నికల సమరాన్ని ఎదుర్కోబోతోంది. నేడు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 11 వరకూ అంటే మొత్తం మూడు రోజుల పాటూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఐతే… 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉప సంహరణకు టైమ్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాతేముంది… ఎవరెవరు పోటీ చేయబోతున్నారో ప్రకటిస్తారు. మరి ఎన్నికలు ఎప్పుడంటే… ఈ నెల 21న ZPTC, MPTC పోలింగ్ జరగబోతోంది. అది జరిగిన మూడ్రోజులకే 24న కౌంటింగ్ నిర్వహించి… ఫలితాలు ప్రకటిస్తారు. దాంతో ఎవరెవరు గెలిచిందీ తెలిసిపోతుంది. ఆ తర్వాత ఓ ఆరు రోజులు వదిలేసి… ఈ నెల 30న జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక… పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. అదే రోజు వైస్ ఛైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా ఉంటుంది. ఆ తర్వాత MPP, వైస్ MPP, కో ఆప్షన్ సభ్యుల్ని ఎన్నుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో 660 ZPTC, 9984 MPTC స్థానాలున్నాయి. మనం చూస్తుండగానే… వీటన్నింటికీ ఎన్నికలు జరగబోతున్నాయి.

మున్సిపాల్టీ, కార్పొరేషన్ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది ఎన్నికల సంఘం. ఒకేసారి 12 కార్పొరేషన్లు, 74 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబోతోంది. వీటికి కూడా ఈ నెల 11 (బుధవారం) నుంచీ 13 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 16న మధ్యాహ్నం 3 గంటల లోపు… నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత ఫైనల్‌గా అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తారు. అందువల్ల 23న ఉదయం 7 గంటల నుంచీ సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ ఉంటుంది. 27న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. అదే రోజు రిజల్ట్స్ కూడా చెప్పేస్తారు. అందువల్ల 31న 12 కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో ఉంటుంది. అలాగే మున్సిపాలిటీలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక కూడా ఉంటుంది.ఈ రెండు ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగబోతున్నాయి. కాకపోతే… ZPTC ఎన్నికలకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ వాడుతుండగా… MPTC, మున్సిపాలిటీ ఎన్నికలకు వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ వాడబోతున్నారు. కాబట్టి… ఇక మనం ఈ ఎన్నికల ఫలితాల్ని బట్టీ… వైసీపీ పాలన ఎలా ఉంది, ప్రతిపక్షాల బలం పెరిగిందా, తగ్గిందా అనే అంచనాలు కొంతవరకూ వేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *