ఏ. పి లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు

కరోనా వైరస్‌ను బూచిగా చూపి ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ దెబ్బ తీస్తున్నారా? అసలు ఏపీలో కరోనా వచ్చే అవకాశముందా? ఏపీలో ఉన్న ఎయిర్‌పోర్టులెన్ని? అందులో ఇంటర్నేషనల్‌ సర్వీసులెన్ని? విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కడి నుంచి ఏపీకి వస్తున్నారు? రాష్ట్రంలో ఉన్న నియంత్రణ ఏర్పాట్లేంటీ? గత 45 రోజులుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలేంటీ? ఈ స్టోరీ చూస్తే అసలు జరుగుతున్నదేంటో మీకే అర్థమవుతుంది.

కరోనా బూతాన్ని చూపి ఏపీలో రాజకీయాలు
ఏపీలో అంటువ్యాధులు విస్తరించే అవకాశం చాలా తక్కువ
ఏపీలో ఎయిర్‌పోర్టులు దేశీయ ప్యాసింజర్ల కోసం ఉన్నవే
విదేశాల నుంచి ఏపీకి రావాలంటే హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నుంచి రావాల్సిందే
ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో స్ర్రీనింగ్‌ పరీక్షల తర్వాతే ఏపీకి
డొమెస్టిక్‌ ప్లైట్‌లో ఏపీకి వచ్చినా మరోసారి పరీక్షలు

కరోనా వైరస్‌ కేవలం విదేశాల నుంచి వచ్చే ప్యాసింజర్ల ద్వారా మాత్రమే వస్తుందని సాక్షాత్తు సివిల్‌ ఏవియేషన్‌ మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. పైగా ఇందుకోసం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుల్లో అన్ని రకాల స్ర్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. దేశంలో ఉన్న 30 ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుల ద్వారా 12లక్ష లమందికి స్ర్రీనింగ్‌ చేసినట్లు కూడా ఆయన తెలిపారు. అంతేకాదు ఇంటర్నేషనల్ ప్రయాణీకులు ఎవరు వచ్చినా సరే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఐసోలేషన్‌ చేసిన తరువాతే వారికి వైరస్‌ సోకలేదని నిర్ధారణ చేసుకుని ఇంటికి పంపిస్తున్నామని ఆయన అన్నారు.

మన దశంలో ఢిల్లీ, ముంబాయ్‌, కోల్‌కత్తా, చెన్నై ,హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాలలో మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఆపరేట్‌ చేసే ఇంటర్నేషనల్‌ సర్వీసులు ఉన్నాయి. మేజర్‌ ఇంటర్నేషనల్‌ డెస్టినేషన్స్‌ ఇండియాకు ఎవరు రావాలన్నా వీటి నుంచి రావాల్సిందే. 2018 ఏప్రిల్‌ -2019 మార్చి వరకు ఈ ఏయిర్‌ పోర్టులకు వచ్చిన ప్రయాణీకుల సంఖ్యను గమనిస్తే….

ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌
మొత్తం ప్రయాణీకులు 6 కోట్ల 24 లక్షల మంది
1.9 కోట్ల ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్స్‌
4.9 కోట్ల దేశీయ ప్రయాణీకులు

ముంబయ్ ఎయిర్ పోర్ట్‌
మొత్తం ప్రయాణీకులు 4 కోట్ల 89 లక్షల మంది
1.3 కోట్ల ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్‌
3.38 కోట్ల దేశీయ ప్రయాణీకులు

బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌
మొత్తం ప్రయాణీకులు 3కోట్ల 34 లక్షల మంది
48లక్షలు ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్స్‌
2 కోట్ల 87 లక్షల మంది దేశీయ ప్రయాణీకులు

చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌
మొత్తం ప్రయాణీకులు 2 కోట్ల 25,43,822 మంది
31లక్షల మంది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్‌ ,
కోటి 90లక్షల మంది దేశీయ ప్రయాణీకులు

కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్‌ దీన్నే నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌ అంటారు.
కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్‌
మొత్తం ప్రయాణీకులు 2 కోట్ల 25లక్షల మంది
31లక్షల మంది ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్స్‌ ,
కోటి 94 లక్షల మంది దేశీయ ప్రయాణీకులు

ఇక GMR హైదరాబాద్‌ ఇంటర్నేసనల్ ఎయిర్‌పోర్ట్‌
మొత్తం ప్రయాణీకుల సంఖ్య 2 కోట్ల 15 లక్షలు
ప్రతీ రోజు విదేశాల నుంచి వచ్చే వారు 8వేల మంది
ప్రతీ రోజు దేశీయ ప్రయాణీకులు 60వేల మంది

మరొక ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ పూణె ఎయిర్‌పోర్ట్‌
మొత్తం ప్రయాణీకుల సంఖ్య 9లక్షల 10వేల మంది
7లక్షల 59 వేల డొమస్టిక్‌ ప్యాసింజర్స్‌,
2లక్షల మంది విదేశీ ప్రయాణీకులు

ఇక ఎపిలో వచ్చే సరికి ఇక్కడ రెండు పెద్ద ఎయిర్‌ పోర్టులున్నాయి. అవి పేరుకు మాత్రమే ఇంటర్నేషనల్ కానీ వాటి సర్వీసులు ఇప్పటి వరకే డొమస్టిక్‌ సర్వీసులకే పరిమితమయ్యాయి. ఏ ప్రయాణీకులైన ఇంటర్నేషనల్‌ నుంచి ఎపికి రావాలన్నా ముందుగా దేశంలోని మేజర్‌ ఎయిర్‌పోర్టులను దాటి విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్, విశాఖ పట్టణంలోని ఎయిర్‌పోర్ట్‌కు రావాలి. కరోనా వైరస్‌సోకిన ప్రయాణీకులకు అప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులలో స్ర్రీనింగ్‌ అయి ఉంటుంది

కాబట్టి ఆ వైరస్‌ ప్రయాణీకుల ద్వారా ఎపికి వచ్చే ఆవకాశం లేదు. పైగా ఎపి ప్రభుత్వం సైతం విశాఖ పట్టణం ఎయిర్‌పోర్ట్‌లో150 పడకలు , గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో 50 పడకలతో ఐసోలేషన్‌ ఆసుపత్రిని ఏర్పాటుచేసింది. ఇక్కడ వారికి మరోసారి స్ర్రీనింగ్‌ చేస్తామని ఎపి ముఖ్యమంత్రి చెప్పారు.
ఇంత పకడ్భంది ఏర్పాట్లను ఎపి ప్రభుత్వం చేస్తున్నా సరే .. రాష్ట్రం ఇమేజ్‌ దెబ్బతీయడానికి రాజకీయంగా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *