ఐటీ రైడ్స్ తో టీడీపీ ఉక్కిరి బిక్కిరి !!

తెలుగుదేశం అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ ఇంటిపై ఐటీ రైడ్స్ వ్యవహారం లో తెలుగుదేశం పార్టీ మళ్లీ డిఫెన్స్ లోకి పడిపోతున్న వైనం స్ఫష్టం అవుతూ ఉంది. శ్రీనివాస్ అనే చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ పై ఐటీ రైడ్స్ జరిగిన తొలి రోజే ఏకంగా 150 కోట్ల రూపాయల వరకూ అక్రమాస్తులు బయటపడినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఐదు రోజుల పాటు రైడ్స్ కొనసాగాయి. ఆ దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయని.. ఏకంగా 2000 కోట్ల రూపాయల వరకూ అక్రమాస్తులు బయటపడినట్టుగా ప్రచారం జరిగింది. ఆ మేరకు ఐటీ శాఖ కూడా ప్రెస్ నోట్ విడుదల చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే అలాంటిదేమీ లేదని తెలుగుదేశం నేతలు కాస్త లేటుగా మీడియాకు ఎక్కారు. కేవలం రెండు లక్షల రూపాయల స్థాయి నగదు 12 తులాల బంగారం మాత్రమే బయటపడిందని టీడీపీ వాళ్లు వాదించసాగారు. మొదట శ్రీనివాస్ ఇంట్లో అక్రమాస్తులు దొరికితే తమకేం సంబంధం అని వాదించిన తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆ తర్వాత ఆయన ఇంట్లో ఐటీ శాఖ గుర్తించింది కేవలం పరిమిత స్థాయి అక్రమాస్తులే అన్నట్టుగా మాట్లాడారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తోందని రెండు లక్షల రూపాయల నగదును రెండు వేల కోట్లు అని ప్రచారం చేస్తోందని తెలుగుదేశం వాళ్లు ధ్వజమెత్తారు.

అయితే ఇప్పుడు మరో కథ బయటకు వచ్చింది. అదేమిటంటే.. ఐటీ శాఖ పంచనామా కేవలం ఒక్క పేజీ కాదు అనే విషయం బయటపడింది. ఆ పంచనామా నివేదిక అనేక పేజీలు ఉందని అయితే తెలుగుదేశం వాళ్లు మాత్రం అందులో ఒక్క పేజీ మాత్రమే విడుదల చేశారనే విషయం బయటపడింది. ఏ పేజీకా పేజీలో ఐటీ అధికారులు వివిధ మొత్తాలను రాసినట్టుగా తెలుస్తోంది. ఆ నివేదిక పదికి పైగా పేజీలున్నాయని సమాచారం. కానీ తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క పేజీని మాత్రమే పట్టుకుని.. శ్రీనివాస్ ఇంట్లో దొరికింది కేవలం రెండు లక్షల రూపాయలంటూ హడావుడి మొదలుపెట్టిందని తెలుస్తోంది. ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన వివరాలను దాచేస్తూ.. తమకు అనుకూలంగా ఉండే ఒక్క పేజీని మాత్రమే విడుదల చేసి తెలుగుదేశం పార్టీ అడ్డంగా దొరికిపోయిందనే ప్రచారమూ సాగుతోందిప్పుడు. మొత్తానికి ఈ వ్యవహారంలో అసలు కథలేమిటో బయటకు రావాలంటే ఐటీ శాకే స్పందించాలేమో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *