ఐదేళ్లలో 30 కోట్లు సంపాదించిందా?

సినీరంగంలో స్టార్ డమ్ చిక్కితే అటుపై ఆర్జన కూడా అదే రేంజులో ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ గ్లామర్ పరిశ్రమ అంటే అంతగా మోజు పడి పోతుంటారు. అయితే అది అందరికీ అందేస్తుందా? అంటే కష్టమే. కొందరికే రాసిపెట్టి ఉంటుందిక్కడ. అలా వచ్చిన వాళ్లలో ఎవరికో కానీ సంపాదించే యోగం ఉండదు. ఇదిగో నటనలో కెరీర్ ఆరంభించిన కేవలం ఐదారేళ్లకే యంగ్ కియరా 30కోట్లు సంపాదించిందన్న గుసగుస వినిపిస్తోంది.

ముంబై బ్యూటీ కియారా అద్వాణీ తెలుగులో `భరత్ అనే నేను` చిత్రంతో పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్ లో ఉండగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `వినయ విధేయ రామ`లోను ఛాన్స్ అందుకుంది. ఇలా ఆరంభమే ఇద్దరు స్టార్ హీరోల ఆఫర్లతో మీడియాలో పాపులరైపోయింది. తొలి సినిమా సక్సెస్ అయినా తర్వాత ఫెయిల్యూర్ ఎదుర్కొంది. అయినా తనకు చ్చిన నష్టమేమీ లేదిప్పుడు. బాలీవుడ్ లో కబీర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ లో ఛాన్స్ అందుకుంది. దీంతో కియారా పేరు జాతీయ మీడియా సహా టాలీవుడ్ మీడియాలోను హాట్ టాపిక్ అయింది.

తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన అర్జున్ రెడ్డి కి కబీర్ సింగ్ రీమేక్ కావడం.. నటిగా చెలరేగేందుకు కియారాకు ఛాన్స్ దక్కడంతో నటిగానూ పేరొచ్చింది. `కబీర్ సింగ్` లో షాహిద్ కపూర్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో అమ్మడు ఎంతగా చెలరేగిందో? చెప్పాల్సిన పనిలేదు. `కబీర్ సింగ్ `బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ అవ్వడంతో అమ్మడి కెరీర్ కి తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం హిందీ పరిశ్రమ లో బిజీగా ఉంది. ప్రస్తుతం అక్కడ నాలుగు సినిమాలు సహా నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లోనూ నాయికగా నటిస్తోంది.

కియరా కథానాయికగా తన బ్రాండ్ ఇమేజ్ ను వాణిజ్య ప్రకటనల వరల్డ్ లో తెలివిగా వినియోగించుకుంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అన్న నానుడిని తూచ తప్పకుండా పాటిస్తోంది. నాలుగు చేతులా ఆర్జిస్తూ.. ఈ అమ్మడు ఈ ఐదారేళ్ల కాలంలోనే దాదాపు 30 కోట్లకు పైగానే వెనకేసిందిట. సినిమాలు..బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసిన ప్రాజెక్ట్ ల ద్వారా వచ్చిన మొత్తం లెక్కలు తేల్చగా అంత పెద్ద మొత్తం సేవ్ చేసిందిట. ఈ ఏడాది అమ్మడు డైరీ ఇప్పటికే ఫుల్ అయింది. అలాగే ఇంకొన్ని సినిమాలకు సైన్ చేసిందిట. వాటికి భారీగానే అడ్వాన్సులు రూపంలో అందుకుందని కథనాలొస్తున్నాయి.వాస్తవానికి అమ్మడి తొలి మూవీ `ఫగ్ లీ`లో నటించేప్పుడు అసలు ఏమాత్రం ఇంత హంగామా లేనే లేదు. ఎమ్.ఎస్ ధోనీ- యాన్ అన్ టోల్డ్ స్టోరీ లో ధోనీ గాళ్ ఫ్రెండ్ పాత్ర లో నటించి విమర్శకుల ప్రశంలందుకుంది. ఆ సినిమా విజయంతోనే కియారా పేరు బయట పాపులరైంది. కియారా మొదటి పేరు అలియా అద్వాణి.. ఆ తర్వాత కైరా అద్వాని గా మార్చుకుని చివరిగా కియారా గా మారిపోయింది. ఈ పేరు కలిసొచ్చి నాలుగు చేతులా ఆర్జించేస్తోంది. ఇక తన తల్లిదండ్రులు టీచర్- డాక్టర్ వంటి వృత్తుల్లో ఉండడంతో అంతో ఇంతో ఆస్తులు అయితే ఉన్నాయి లెండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *