ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది కోహ్లీ సేన…

న్యూజిలాండ్​తో జరుగుతోన్న టీ20 సిరీస్​లో టీమిండియా మరో విజయం ఖాతాలో వేసుకుంది. చివరిదైన ఐదో టీ20లోనూ కివీస్​కు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (60) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రాహుల్ 45 పరుగులతో రాణించాడు.

అనంతరం 164 పరుగుల లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ తడబడుతూ ఆరంభించింది. గప్తిల్ (2), మున్రో (15), బ్రూస్ (0) నిరాశపర్చగా 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన టేలర్, సీఫెర్ట్​లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. జోరుమీదున్న సీఫెర్ట్​ (50), రాస్ టేలర్ (53)ను నవదీప్ సైనీ పెవిలియన్ పంపి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. తర్వాత కివీస్ ఏ దశలోనూ కోలుకోలేదు. చివరి ఓవర్లో సోధి రెండు సిక్సులు కొట్టినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసి ఓటమిపాలైంది న్యూజిలాండ్. 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సిరీస్​ను క్లీన్ స్వీప్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *