ఐసీస్ భారీ స్కెచ్ ను భగ్నం చేసిన కశ్మీరీ పోలీసులు

దేశంలో పెద్ద ఎత్తున ఉగ్ర అలజడిని రేకెత్తించటానికి ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ భారీ స్కెచ్ కు ప్లాన్ చేసింది. వారు అనుకున్న రీతిలో కానీ ప్లాన్ సక్సెస్ అయి ఉంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకునేవి. అయితే.. కశ్మీరీ పోలీసులు అలెర్ట్ గా ఉన్న నేపథ్యంలో.. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ ఐదుగురు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వారి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్న వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది.

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఐదుగురు ఉగ్రవాదులు అక్రమంగా కశ్మీర్ లోకి అడుగు పెట్టారు. దీనికి సంబంధించిన పక్కా సమాచారం అందుకున్న కశ్మీరీ పోలీసులు స్పందించారు. బుడ్గాం జిల్లాలో వారిని అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాదులకు ఐసీస్ తో పాటు.. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో కూడా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

వీరి వద్ద నుంచి అత్యాధునిక ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాల్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన ఐదుగరిని షాన్ వాజ్ అహ్మద్ వనీ.. నాసీర్ అహ్మద్.. బిలాల్ అహ్మద్ ఖాన్.. ఇర్పాన్ అహ్మద్ పఠాన్.. అలీ మహ్మద్ భట్ గా గుర్తించారు. వీరి అరెస్టుతో ఉగ్రవాదులు పన్నిన భారీ స్కెచ్ భగ్నమైందన్న మాట వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *