ఒక జంట చేసిన చెత్త పని..

కామం తన్నుకొచ్చినప్పుడు కన్నుమిన్ను కానరాకుండా వ్యవహరిస్తారని తిట్టి పోస్తారు. కానీ.. తాజాగా ఫిలిప్పీన్స్ లోని బోరాకే ద్వీపంలో వెలుగు చూసిన వైనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక జంట చేసిన చెత్త పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిగ్గు.. లజ్జ.. అభిమానం.. లాంటి పదాలతో తమకు సంబంధం లేదని.. కేవలం రొమాన్స్ మాత్రే తమ ప్రయారిటీ అన్నట్లుగా వ్యవహరించిన వైనం ముక్కున వేలేసుకునేలా చేసింది.

ఫిలిప్పీన్స్ లోని బోరాకే ద్వీపంలో బ్రిటన్ కు చెందిన జాస్మిన్.. ఆస్ట్రేలియాకు చెందిన అంథోనిలకు ఎలా పరిచయమైందో కానీ.. అక్కడి బీచులోకి వెళ్లారు. చిన్నా.. పెద్దా.. ఇలా అన్ని వర్గాల వారు ఉన్నరన్న విషయాన్ని వదిలేశారు. విచక్షణ మరిచి ఓపెన్ గా సెక్స్ చేయటం షురూ చేశారు. దీంతో.. తోటి పర్యాటకులు చెప్పినా.. వారిద్దరూ లైట్ తీసుకున్నారు. సాయంత్రం ఐదున్నర గంటల వేళ.. బీచ్ అంతా రద్దీగా ఉన్నప్పుడు.. వారిద్దరు అలా చేయటాన్ని అక్కడోళ్లు జీర్ణించుకోలేక పోయారు.

దీంతో.. వారు పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. జరిగింది తెలిసి వారు అవాక్కు అయ్యారు. ఇద్దరికి బేడీలు వేసి.. పోలీసు వ్యాన్ లోకి ఎక్కించారు. షాకింగ్ అంశం ఏమంటే..అలాంటి పరిస్థితుల్లోనూ తామున్నది పోలీస్ వ్యాన్ అన్నది పట్టించుకోకుండానే.. అందులోనూ సెక్స్ చేయసాగారు. దీంతో తలలు పట్టుకున్న పోలీసులు వారిని బలవంతంగా విడదీయాల్సి వచ్చిందట.

ఇద్దరూ పీకలదాకా తాగి ఉండటంతో.. మద్యం మత్తులో విచక్షణ మరిచి వారు సెక్స్ లో పాల్గొన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తాము చేస్తున్న పనికి సిగ్గు పడని వారు.. ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా వీరు చేసిన ఆరాచకానికి కేసులు నమోదు చేశారు. తర్వాత బెయిల్ ఇచ్చి వదిలేశారు.

తాము చెప్పినట్లుగా వారు కానీ కోర్టుకు హాజరుకాకుంటే భవిష్యత్తులో ఫిలిప్పీన్స్ ను సందర్శించకుండా వారిపై నిషేధం విధిస్తామని చెప్పటం గమనార్హం. జంతువులు సైతం.. సెక్స్ చేసేటప్పుడు కొన్ని అంశాల్ని అయినా పరిగణలోకి తీసుకోవటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఈ జంట వ్యవహరించిన తీరు ఇప్పుడు వైరల్ న్యూస్ గా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *