ఓటు హక్కు వినియోగించుకొండి ఇలా

6 రకాల ఓట్లు- వివరాలు..
మన రాజ్యాంగంలో ఓటును ఆరు రకాలుగా విభజించారు అవి…..
1.ఓటరు లిస్టులో పేరున్న *సాధారణ పౌరుడు* నేరుగా పోలింగ్ బూతులోకి వెళ్లి ఓటు వేస్తే దానిని ” *సాధారణ ఓటు*”అంటారు
2. *ఎన్నికల* విధుల్లో పాల్గొనే *సిబ్బంది* వేసే ఓటును” *పోస్టల్ బ్యాలెట్* “ఓటు అంటారు
3. *దేశసైనికులు,పారామిలిటరీ* ఉద్యోగులు వేసే ఓటును ” *సర్వీస్ ఓటు*”అంటారు
4. *ఇంటెలిజెన్స్, గూడాచారి సిబ్బంది* వారి ఓటును వారు వేసుకో లేరు కాబట్టి *వారికి బదులుగా* వారి *ప్రతినిధి* వేసే ఓటును” *ప్రాక్సీ ఓటు*” అంటారు.
5. ఒక్కొక్కసారి పౌరులు ఓటు వేయటనికి వెళ్లే సరికి *ఆ ఓటును వేరే వాళ్ళు వేస్తే* ఆ పౌరులు సంబంధిత పోలింగ్ అధికారిని సంప్రదించి, డిమాండ్ చేసి, *ID నిరూపించుకొని వేసే ఓటు* ను ” *టెండర్ ఓటు*” అంటారు
6.పౌరులు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ *ఆ ఓటును వేయనీయకుండా* అధికారులు కానీ,ఏజెంట్లు కానీ *అభ్యంతరం పెడితే* , ఆ పౌరులు సంబంధిత అధికారిని సంప్రదించి *నిర్ణీత రుసుమును చెల్లించి వేసే ఓటు* ను ” *ఛాలెంజ్ ఓటు* “అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *