ఓ డియర్ ఉగాది కి విడుదల కానుందా??

డార్లింగ్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో #ప్రభాస్20 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మొదట్లో ‘జాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని అన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ‘ఓ డియర్’ టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాది సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఉగాది తెలుగువారికి ఇష్టమైన పండుగలలో ఒకటి. ఈ ఏడాది ఉగాది మార్చి 25 వ తేదీన జరుపుకోబోతున్నారు. ప్రభాస్ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది సూపర్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. ‘గీతాంజలి’ తరహాలో ఈ సినిమా ఒక క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోందని.. ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుందని సమాచారం. బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఇప్పటికే ఈ సినిమాకు రూ.140 కోట్లు ఖర్చు పెట్టారట. ఈమధ్య ప్రభాస్ ఎక్కువగా యాక్షన్ ప్రధాన చిత్రాలలో నటిస్తున్నారు కాబట్టి ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులకు ఒక విభిన్న అనుభూతిని ఇస్తుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *