కరొనా ప్రభావం: ఒలంపిక్స్??

ప్రపంచం కొవిడ్-19 (కరోనా) వైరస్ తో వణుకుతోంది. ఈ వైరస్ బారిన చైనా తీవ్రంగా సతమతమవుతుంటే దీని ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ఇప్పుడు కొవిడ్ ప్రభావం టోక్యోలో జరగాల్సిన ఒలంపిక్స్ పై కూడా పడే అవకాశం ఉంది. జులై 24వ తేదీన జపాన్ లోని టోక్యో నగరంలో ఒలంపిక్స్ నిర్వహించనున్నారు. అయితే కొవిడ్ ప్రభావంతో అవి జరుగుతాయో లేవోనని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. కొవిడ్ ప్రభావంతో ఇప్పటికిప్పుడే ఒలంపిక్స్ నిర్వహణ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరాదని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ మైకెల్ ర్యాన్ తెలిపారు. ఒలంపిక్స్ నిర్వహణపై తాము ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేశారు. అయితే కొవిడ్ ముప్పును అంచనా వేయడంలో అంతర్జాతీతీయ ఒలపింక్స్ కమిటీకి సహకరిస్తామని ప్రకటించారు. భవిష్యత్ లో వారితో కలిసి పని చేస్తామని తెలిపారు. కొవిడ్ వైరస్ విషయమై అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీతో డబ్ల్యూహెచ్ఓ సంప్రదింపులు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *