కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు మాత్రమే పాటించండి

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఆయుర్వేదమే దాని అసలైన విరుగుడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాము చెప్పినట్లు చేస్తే కరోనా భరతం పట్టవచ్చని, దాన్ని దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ఇష్టమొచ్చినట్లు సూచనలు ఇస్తున్నారు.

అందులో ఓ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వెల్లుల్లి రసం తాగితే కరోనా రాదని.. కొన్ని పదార్థాలు వాడి ఆ రసాన్ని తాగాలని ఆ మెసేజ్ సారాంశం. వెల్లుల్లి వేడి నీటిలో మరిగించి, ఉప్పు, వెనిగర్‌ వేసి బాగా కలిపి.. ఆ రసాన్ని సేవించాలని చెబుతున్నారు. మరి.. అందులో వాస్తవం ఎంత? నిజంగానే కరోనా రాదా? అంటే.. అదంతా అబద్ధమని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం.

పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు మాత్రమే పాటించాలని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేసింది. అది.. ఫేక్ న్యూస్ అని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశాలను, సూచనలు పాటించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని ప్రజలకు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *