కరోనా కు భయపడవద్దు :ప్రధాని మోడీ

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 6500 దాటింది. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన దేశంలో 112 మంది ఈ వైరప్ బారినపడ్డారు. రోజురోజుకూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో అన్ని రాష్ట్రాలూ అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ని మూసివేయడంతో వివాహ కార్యక్రమాలపైనా ఆంక్షలు విధించాయి. ఇలా పూటకో వార్తతో కరోనా వైరస్‌పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రధాని వీడియో సందేశం పంపారు. కరోనా వదంతులను ప్రజలు నమ్మవద్దని.. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు, కరోనాను నిరోధించవచ్చని సూచించారు.

“కరోనా వైరస్‌పై అనేక రకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. వీటికి ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నా. వైరస్‌ గురించి ఆందోళన చెందకుండా.. దాని నివారణకు సరైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే చాలు. చాలా మంది తరచూ తమ చేతులతో ముఖాన్ని, కళ్లను తుడుచుకుంటూ ఉంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులతో ముఖాన్ని, కళ్లను పదేపదే తాకకూడదు. వైరస్‌ వచ్చినట్లు మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా భయపడకుండా వెంటనే డాక్టర్‌ను కలవండి.”
— ప్రధాని నరేంద్ర మోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *