కరోనా కేసులా.. వెంటనే ఇన్సూరెన్స్ చెల్లించండి

భారతదేశమంతా ఇప్పుడు కరోనా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ వైరస్ బారిన పడకుండా ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఈ వ్యాధి సోకిన వారికి వెంటనే బీమా ఉంటే చెల్లించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా సంబంధిత క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని బీమా సంస్థలను ఇన్సూరెన్స్ కంపెనీలకు బాస్ అయిన ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశించింది. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన వ్యయాలు కవరయ్యేలా పాలసీలు రూపొందించాలని ఇన్సూరెన్స్ సంస్థలకు సూచించింది.

కరోనా వైరస్ బాధితులు కనీసం 24 గంటల పాటు ఆస్పత్రులో ఉండి చికిత్స తీసుకుంటే క్లెయిమ్లు పరిష్కరిస్తామని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. కరోనా బాధితులవి పెండింగ్ లో పెట్టవదని సూచించింది. కరోనా సోకిన వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే హాస్పిటలైజేషన్ పాలసీల కింద వీరి క్లెయిమ్లను వెంటనే సెటిల్ చేస్తామని మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తెలిపింది. కరోనా తీవ్ర రూపం దాల్చుతుండడంతో వెంటనే దాని నివారణకు తమ వంతు సహాయం చేస్తున్నట్లు బీమా కంపెనీలు ప్రకటించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *