కరోనా వ్యాప్తి కి అలుగు జంతువులు కారణం..!!

ప్రస్తుతం కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి వైరస్ తమ దేశంలోకి చొరబడకూడదంటూ ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.

ఓ వైపు కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టే పనిలో పలువురు శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. మరో రెండు మూడు నెలల్లో కరోనాకు యాంటీడోట్ అందుబాటులోకి తెస్తామని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇప్పటివరకు పాములు – గబ్బిలాల వల్లే కరోనా వ్యాప్తి చెందుతుందని భావించిన శాస్త్రవేత్తులు…తాజాగా కరోనా వ్యాప్తికి అలుగు(పొంగొలిన్) కారణమని చైనా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చైనాలోని ప్రజల ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వ్యాప్తి చెందిందని – పాములు – గబ్బిలాలు తినడం వల్లే ఈ మహమ్మారి ప్రపంచానికి దాపరించిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

అంతేకాకుండా – గబ్బిలాన్ని తిన్నవారు గబ్బిలంలా అరుస్తున్నారని….సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో అసలు కరోనా వ్యాప్తికి పాములు – గబ్బిలాలు కారణం కాదని చైనా శాస్త్రవేత్తలు సరికొత్త వాదన తెరమీదకు తెచ్చారు. తొలుత ఆ వాదనను బలపరిచిన శాస్త్రవేత్తలు తాజాగా – అలుగు (పాంగొలిన్) కూడా కరోనాకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.

అలుగు జన్యుక్రమం కరోనా వైరస్ తో 99 శాతం మ్యాచ్ అవుతోందని చెబుతున్నారు. వైరస్ వ్యాప్తికి ఇదే కారణం అయి ఉండవచ్చని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *