కుటుంబ నియంత్రణ పై .. యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం

జనాభా విస్ఫోటనం భారతదేశంలో తీవ్రంగా ఉంది. ప్రపంచంలో రెండో అతి పెద్ద జనాభా ఉన్న దేశం మనది. దాదాపు 135 కోట్ల జనాభా ప్రస్తుతం దేశంలో ఉందని తెలుస్తోంది. జనాభా నియంత్రణపై పెద్దగా ప్రభుత్వాలు ప్రోత్సాహం కల్పించకపోవడం ఆ దిశన చర్యలు చేపట్టకపోవడంతో జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట పడడం లేదు. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం.. ఒకరు.. ఇద్దరు మద్దు అనే విధానాలు నినాదాలు వాస్తవంగా అమలు కావడం లేదు. ‘ఇద్దరు పిల్లల చట్టం’ ఎప్పటి నుంచో దేశంలో అమలవుతోంది. కానీ వీటిని సక్రమంగా అమలు చేయడం లేదు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలుచేసేందుకు చర్యలు మొదలయ్యాయి.

ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసి జనాభా నియంత్రణ కోసం చర్యలు చేపట్టనున్నారు. పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే వారికి సంక్షేమ పథకాలను ఆపివేయాలనే సంచలన నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుందట. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఈ రాష్ట్రం లో జనాభా పెరుగుదల తీవ్రంగా ఉంది. దీంతో దాన్ని నియంత్రించే ప్రయత్నం లో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త జనాభా విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న ప్రజలను రాష్ట్ర సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందకుండా చేసేందుకు నిబంధనలు రూపొందించనున్నారంట. వారిని ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిబంధన తీసుకువచ్చే అవకాశం ఉంది.

దీనిపై త్వరలోనే ఓ మంత్రివర్గ కమిటీ వేయాలని యోగి భావిస్తున్నారు. దీన్ని ఆ రాష్ట్ర కుటుంబ సంక్షేమ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బద్రి విశాల్ వాస్తవమేనని ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయగా ఉత్తర రాష్ట్రాలు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కన్నా చిన్న రాష్ట్రాలు రాజస్థాన్ మధ్యప్రదేశ్ జనాభా నియంత్రణ కు విజయవంతంగా చర్యలు తీసుకుంటున్నాయని గుర్తుచేశారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు లేకుండా చూసుకునేందుకు పథకాల రూపకల్పనతో పాటు రెండు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టాలు ఉన్నాయని వివరించారు. దీనిపై తాము ఆలోచన చేస్తున్నట్లు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అయితే ఉత్తరప్రదేశ్ లో ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ వ్యూహం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ ‘ఇద్దరు పిల్లల చట్టం’ అమలయ్యేలా చేయడమే ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు ప్రణాళిక” అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ సహకారంతోనే ముఖ్యమంత్రి అయ్యాడు. దీంతో ఆర్ఎస్ఎస్ నిర్ణయాలను తూచ పాటిస్తుంటాడు. ఈ మేరకు మోహన్ భగవత్ ప్రకటన మేరకు ఇఫ్పుడు ఎంపిక చేసిన ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాడని ఉత్తరప్రదేశ్ లోని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *