కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపిన ప్రశాంత్ కిషోర్

కేజ్రీవాల్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ అభినందనలు
ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధనవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు.‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ ట్వీట్‌ చేశారు. కాగా,ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.

టాపాసులు కాల్చకండి : కేజ్రీవాల్‌
ఆప్‌ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. పటాకుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్‌ పేర్కొంది.

ఐదింతలు పెరిగిన బీజేపీ బలం
దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఆప్‌ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 11 గంటలకు ఆప్‌ 54 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 16స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం.

ఉచిత విద్యుత్‌తో ఆప్‌కు అనుకూలం: బీజేపీ ఎంపీ
నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారికి బిల్లు ఉండదని కేజ్రీవాల్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో పేదల ఓటింగ్‌పై ప్రభావం చూపిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్‌ బిధురి అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ దూకుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *