కేరళ లో ఖైదీలు మాస్కులు తయారు చేస్తున్నారు

కరోనా వైరస్ మన దేశంలో వచ్చేసిందని ఆందోళన పడటం వేస్ట్… అలాగని ఏ జాగ్రత్తలూ తీసుకోకుండా… నాకు రాదులే అని అనుకోవడం కూడా తప్పే. ఈ రెండు విషయాల్నీ దృష్టిలో పెట్టుకొని… కేరళ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

ఇంతకు ముందు నిఫా వైరస్, జికా వైరస్ వచ్చినప్పుడు ఎలాగైతే కేరళ ప్రజలు ఒక్కటై ఎదుర్కొన్నారో… ఇప్పుడు కరోనా విషయంలోనూ అదే కాన్ఫిడెన్స్, పట్టుదలతో ముందుకెళ్తున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కి అధికారులు ఓ విషయం చెప్పారు. రాష్ట్రంలో దేశంలో మాస్కులకు కొరత ఉందని అన్నారు. మరి ఏం చేద్దాం అని పినరయ్ విజయన్ ఆలోచిస్తుంటే… ఖైదీలు ముందుకొచ్చారు. తామే స్వయంగా మాస్కులు తయారుచేస్తామని అన్నారు.

అంతే… ఐడియా అదిరింది… అంటూ శుక్రవారం నుంచీ కేరళలోని అన్ని జైళ్లలో ఉన్న టైలరింగ్ యూనిట్లలో… మామూలు బట్టలు పక్కన పెట్టి… మాస్కులు కుట్టిస్తున్నారు. ఇప్పుడు వాటిని కేరళతోపాటూ… దేశమంతా సప్లై చెయ్యాలని డిసైడయ్యారు. అదీ యూనిటీ అంటే. ముందుగా కన్నూర్, వియ్యూర్, తిరువనంతపురం సెంట్రల్ జైళ్లలో ఆల్రెడీ ఉత్పత్తి మొదలైపోయింది. త్వరలో మిగతా జైళ్లలోనూ అమలు చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *