ఫోటో స్టోరీ: ఇది మేడమ్ టుస్సాడ్స్ బికినీ!

కొంతమంది హీరోయిన్లకు ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల గుర్తింపును దక్కించుకుంటారు. ప్రగ్యా జైస్వాల్ అలాగే ‘కంచె’ తో భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి కానీ వాటిలో ఒక్క హిట్ కూడా రాలేదు. అందుకే ప్రగ్య కెరీర్ కాస్త స్లోగా సాగుతోంది. అయితే కెరీర్లో ఎత్తుపల్లాలను ప్రగ్య పెద్దగా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ వీలైనంతగా సమ్మర్ ను త్వరగా తీసుకొచ్చే ప్రయత్నాలు తీసుకొస్తోంది.

ఈ సమ్మర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో భాగంగా ప్రగ్య తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో చేసింది. ఈ ఫోటోకు “సన్ సెట్ స్టేట్ ఆఫ్ మైండ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఈవెనింగ్ మూడ్ లో ఉందని చిల్ అవుట్ అవుతోందనే కదా. నలుపు రంగు బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో నిలుచుని ఓ సూపర్ పోజిచ్చింది. అదేదో సోపు యాడ్ లో పట్టు పట్టు పట్టు అని ప్రేక్షకులను సతాయిస్తారు కదా.. సరిగ్గా అలాగే పట్టులాంటి చర్మం కనిపిస్తోంది. ఇక వెనక్కు తిరిగి ప్రగ్య ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కు ఓ అవార్డు ఏదైనా ఇవ్వాలి. వీలైతే మేడమ్ టుస్సాడ్స్ లో ఇలాంటి మైనపు బొమ్మను కూడా పెట్టాలి.

ఇలాంటి ఇంపాక్ట్ ఉంది కాబట్టే నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. “కిరాక్ బికిని”.. “బ్యాక్ ఈజ్ బ్యూటిఫుల్’.. “బికినీ మ్యాజిక్”అంటూ తమ స్పందనలు తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రగ్య చివరిగా మంచు విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ లో హీరోయిన్ గా నటించింది. పోయినేడాది రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత ప్రగ్యకు మరో ఆఫర్ రాలేదు. ఈ ఈతకొలను బికినీలు చూసి ఎవరైనా ఫిలిం మేకర్ల హృదయం కరిగి ఆఫర్ల రూపంలోకి మారితే మంచిదే కదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *