క్యాన్సర్‌ డే: సోనాలి బింద్రే ఎమోషనల్‌ పోస్ట్‌

ఒకప్పుడు స్టార్‌ కథానాయికగా తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించిన నటి సోనాలి బింద్రే. వివాహానంతరం సినిమాలకు దూరమైన ఆమె యావత్‌ చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయే వార్తను ప్రకటించారు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించడంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే, ఆ తర్వాత క్యాన్సర్‌ చికిత్స తీసుకున్న ఆమె, వ్యాధితో బాధపడేవారికి అండగా నిలబడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తనదైన సందేశాలతో స్ఫూర్తిని నింపుతున్నారు.

మంగళవారం ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘జీవితంలో మార్పు అనేది ఎప్పుడూ ఉంటుంది. దాంతో జీవితమే మారిపోతుంది. అది జరిగి నా జీవితంలో అప్పుడే రెండేళ్లు గడిచిపోయాయి. ఈ రెండేళ్లు నాకెన్నో పాఠాలు నేర్పాయి. ఈ ప్రయాణంలో సహనం నాకు అలవడింది. ఓర్పుతో వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రతి నిత్యం కొత్తగా, బలంగా నన్ను నేను మార్చుకున్నా. నేనెవరో నాకు తెలిసింది. అన్నింటికన్నా మనమే ఎక్కువన్న వాస్తవం తెలిసింది. మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ధైర్యంగా ఉంటే క్యాన్సర్‌ ఏమీ చేయలేదు’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *