క్యూట్ హీరోయిన్ కు సెకండ్ బేబి బోయ్

కరణ్ జోహార్ మూవీ `ఏ దిల్ హై ముష్కిల్` లో చివరిసారిగా కనిపించింది లిసా హెడెన్. ఆ తర్వాత మోడలింగ్ అసైన్ మెంట్స్ .. రెగ్యులర్ ఫోటోషూట్లు.. హబ్బీతో విదేవీ విహారాలతోనే నిరంతర వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒక వివాదాస్పద అంశంతోనూ అప్పుడప్పుడు తనని తాను లైమ్ లైట్ లో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది.

2016లో ఎంటర్ ప్రెన్యూర్ డినో లల్వానీని పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. 2017లో ఈ జంటకు మొదటి బిడ్డ జాక్ జన్మించాడు. తాజాగా తమ రెండవ బిడ్డకు డినో- లిసా జంట జన్మనిచ్చారు. చిన్నారికి లియో అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని లిసా స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది.

తన ఇద్దరు కుమారులు జాక్- లియో కలిసి ఉన్నప్పటి ఓ ఫోటోని లిసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ఈ చిన్నారుల మనసు నా హృదయాన్ని తాకింది. పూర్తిగా మాటలు రావు.. ప్రేమ అనురాగంతో మీ ఇద్దరినీ చూస్తున్నా“ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. కొన్ని నెలల క్రితం లిసా తను గర్భిణి అన్న విషయం వెల్లడించింది. అటుపై తన బేబీ బంప్ ఫోటోల్ని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *