క్రెడిట్, డెబిట్ కార్డ్స్ పై ఆర్ బి ఐ కొత్త రూల్స్…

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) క్రెడిట్/డెబిట్ కార్డులకు ఇప్పటివరకు ఉపయోగిస్తున్న రూల్స్ మార్చింది. వీటికి సంబంధించిన మార్గ దర్శకాలను బ్యాంకులకు పంపింది. ఈ కొత్త రూల్స్ మార్చి 16 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు క్రెడిట్ డెబిట్ కార్డు హోల్డర్లు మోస పోతున్నారు. ఖాతాదారులు ఎక్కువగా క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా ట్రాన్సక్షన్లు చేస్తుండటం తో వీటి భద్రత ను దృష్టిలో ఉంచుకొని కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. కార్డు వినియోగదారులు ఈ క్రింది చెప్పే వాటిని పాటిస్తే మోసపోకుండా ఉంటారు.. కార్డు బ్లాక్ కాకుండా ఉంటుంది. లేనట్లతే కార్డు పని చేయకుండా పోయే అవకాశం ఉంది.

-ఇండియా లోని ఏటీఎం సెంటర్లు పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్) వద్ద కేవలం దేశీకార్డు లావాదేవీలకు మాత్రమే అనుమతించాలి.

-అంతర్జాతీయ ట్రాన్సక్షన్లు కాంటాక్ట్ లెస్ లావాదేవీల కోసం వినియోగదారులు ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసుకోవాలి.
-క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఆన్ లైన్ లావాదేవీలకు ఉపయోగించనట్లయితే వాటిని జారీ చేసిన సంస్థలు రద్దు చేసే అవకాశం ఉంటుంది.
-కస్టమర్ల ట్రాన్సక్షన్ల రిస్కు ప్రతి పాదికన అంతర్జాతీయ కాంటాక్ట్ లెస్ లావాదేవీలను అనుమతించాలా? లేదా అనే నిర్ణయం కార్డులు జారీ చేసిన సంస్థలకే ఉంటుంది.
-కార్డు హోల్డర్లందరికీ 24/7 కార్డు ఆన్ ఆఫ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే లావాదేవీల్లో లిమిట్ ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుంది.
-డొమెస్టిక్ ఇంటర్నేషనల్ పీఓఎస్ ఏటీఎం ఆన్ లైన్ కాంటాక్ట్ లెస్ వంటి ఎలాంటి లావాదేవీల్లో ఆన్ ఆఫ్ చేసుకునే సదుపాయం ఆయా బ్యాంకులు అందుబాటు లో ఉంచాలి.
-ప్రీపెయిడ్ గిప్ట్ కార్డ్స్ వంటి వాటికి ఈ కొత్త రూల్స్ తప్పనిసరి కాదు.ఈ నూతన నిబంధనలు పాటించినట్లయితే మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు భద్రత గా ఉంటుంది. ఈ రూల్స్ పాటించనట్లయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న కార్డులు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. కావున కార్డు వినియోగదారులు ఈ కొత్త రూల్స్ పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *