గుజరాత్ తో అనుబంధం తీరిపోయింది !!

లాల్కృష్ణా అద్వానీ …బీజేపీలో అగ్రనేత బీజేపీ కురువృద్దుడు అని కూడా ఈయన్ని పిలుస్తారు. బీజేపీ ని అధికారంలోకి తీసుకురావడానికి ఈయన చేసిన కృషి అమోగం.1984లో రెండు సీట్లు గెలిచిన బీజేపీ.. 1989లో 85 సీట్లు తీసుకొచ్చిన మహానేత. అయితే ఆ తరువాత కొన్ని రోజులు పార్టీలో కీలకంగా వ్యవహరించినా కూడా ..పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. గుజరాత్ రాష్ట్రం తో అద్వానీ కి సన్నిహిత సంబంధం ఉంది. గత 30 ఏళ్ల నుంచి అక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కానీ శనివారం ఢిల్లీ అసెంబ్లీ లో అద్వానీ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే గుజరాత్ కి అద్వానీ కి ఉన్న బంధం తెగిపోయిందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

1989 లోక్ సభ ఎన్నికలతో అద్వానీ రాజకీయలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీతో పాటుగా గాంధీ నగర్ నుంచి కూడా పోటీ చేశారు. గాంధీనగర్ లో అద్వానీపై ప్రత్యర్థి బాలీవుడ్ నటుడు రాజేశ్ ఖన్నా బరిలోకి దిగారు. ఆ ఎన్నికలలో 1500 ఓట్లతో అద్వానీ విజయం సాధించారు. గాంధీ నగర్ నుంచి పోటీ చేయడానికే అద్వానీ ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. అలా గాంధీనగర్ నుంచి ఆరు సార్లు పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2019లో మాత్రం బీజేపీ అద్వానీకి అసలు టికెట్ ఇవ్వలేదు. మాజీ పార్టీ చీఫ్ అమిత్ షాకు అక్కడ టికెట్ కేటాయించి పార్టీ అగ్రనేత సీనియర్ అయిన అద్వానీ ని తీవ్రంగా అవమానించింది.

ఈ కారణం చేతనో లేక పార్టీలో తన ప్రభావం తగ్గి పోయిందనో ..మరో కారణమో తెలియదు కానీ తన ఓటును గుజరాత్ నుండి ఢిల్లీకి మార్చుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా అద్వానీ గుజరాత్ లోనే ఓటువేశారు. కానీ గుజరాత్ లో ఓటు తీసేసి న్యూఢిల్లీ లో నమోదు చేయించుకున్నారు. ఆయనకి గతంలో గుజరాత్ లోని జమాల్ పూర్-ఖాడియా అసెంబ్లీ నియోజకవర్గం లో ఓటుహక్కు ఉండేది. అయితే ఈ వ్యవహారం పై అహ్మదాబాద్ ఎన్నికల అధికారి మురళీకృష్ణ వివరణ ఇచ్చారు .. ద్వానీ విజ్ఞప్తి మేరకు గుజరాత్ లో ఓటు హక్కు తొలగించామని చెప్పారు. అలాగే శాశ్వత నివాస స్థలం కూడా ఢిల్లీగానే చూపించారు. దీనితో తాజాగా శనివారం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఔరంగజేబు్ రోడ్డులో గల అటల్ ఆదర్శ్ విద్యాలయలో తన కూతురు ప్రతిభా అద్వానీతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే గతంలో కూడా అయన కూతురి వద్దే ఉండేవారు. ఎన్నికలు వచ్చినా ప్రతీసారి గుజరాత్ వెళ్లి.. మరీ వేసేవారు. కానీ ఈ సారి మాత్రం తన ఓటు ని గుజరాత్ లో తొలగించి .. ఢిల్లీ లో నమోదు చేయించుకున్నారు. దీన్ని బట్టి చూస్తూ …గుజరాత్ తో తన అనుబంధం తీరి పోయిందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *