చదువుకు పేదరికం అడ్డు రాకూడదు.. అమ్మ ఒడి పథకం.. ప్రారంభించిన సీఎం జగన్

విద్యావ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది… పిల్లలను బడికి పంపే పేద తల్లులకు ఏటా రూ15000 అందించే విప్లవాత్మక కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.. చదువుకు పేదరికం అడ్డు రాకూడదని ఉద్దేశంతో అమ్మ ఒడిని ప్రవేశపెట్టారు.. ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్, ఎయిడెడ్, కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులకు రూ15000. అందజేస్తారు.. ఈ పథకం కొరకు రూ.6456 కోట్లు కేటాయించారు. సుమారుగా 43 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన.. 2020-21 విద్యా సంవత్సరం ఒకటవ తరగతి నుండి 6 తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరగనుంది. తర్వాత ఏడవ తరగతి నుండి10 తరగతి వరకు బోర్డు పరీక్షలు ఇంగ్లీష్ మీడియంలో వ్రాసే విధంగా బోధన జరగనుంది. అంతేకాకుండా మనబడి నాడు- నేడు కార్య ఈరోజు వార్తలుక్రమం ద్వారా45 వేల ప్రభుత్వ పాఠశాలలు,471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు,151 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 3287 ప్రభుత్వ హాస్టల్ రూపురేఖలు మారనున్నాయి. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, సాహి ప్రహరీ గోడలు, బ్లాక్ బోర్డ్స్, ఫ్యాన్లు, తదితర సౌకర్యాలు జరగనున్నాయి. ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేలా ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లలకు స్కూళ్లు తెరిచే నాటికి మూడు జతల యూనిఫాంలు, నోటు పుస్తకాలు, బూట్లు ,సాక్షులు, బెల్టులు, బ్యాగులు అందజేస్తారు. ఈ పథకం కొరకు రూ.14 వేల కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజన పథకంలో పథకంలో నాణ్యతను పెంచి పౌష్టికాహారాన్ని అమలు చేయనున్నారు. ఇందుకుగాను రూ.353 కోట్లు కేటాయించారు. డిగ్రీ, పిజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓబీసీ, కాపు, దివ్యాంగులకు, మైనార్టీలకు ఫీజు రీయింబర్స్మెంట్ అందజేశారు. ఈ పథకం అర్హతకు వార్షికాదాయం రూ.2.50 లక్షలకు పెంచారు. జగనన్న వసతి దీవెన ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు మైనారిటీ, దివ్యాంగులకు, వసతి మరియు భోజన ఖర్చుల కొరకు రూ.20,000 రూపాయలు చెల్లి చెల్లిస్తారు.. బతుకులు మార్చే గుడిగా అమ్మ ఒడి కార్యక్రమం అమలయ్యేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా తల్లులు వారి పిల్లల చదువు గురించి ఆలోచించిన ప్రభుత్వం. సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *