చరిత్ర సృష్టించిన జగన్

పది జిల్లాల్లో జెడ్పీటీసీలు ఏకగ్రీవం
శ్రీకాకుళం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాలోనూ జెడ్పీటీసీ స్థానాల్లో ఏకగ్రీవ విజయాలు నమోదయ్యాయి.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా వైఎస్సార్‌ కడపలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను 38 స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఏకగ్రీవమైన జెడ్పీటీసీ స్థానాల సంఖ్యతో అధికార వైఎస్సార్‌సీపీ వైఎస్సార్‌ జిల్లాలో జెడ్పీ చైర్మన్‌ పదవిని సునాయసంగా దక్కించుకోగలదు.
చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలకు గాను, 29 స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది.
నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రెండంకెల జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2000కు పైగా ఎంపీటీసీ స్థానాలను అధికార వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది.

వైఎస్సార్‌ జిల్లాలో కొత్త చరిత్ర tiragarasaru..
వైఎస్సార్‌ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఏకపక్షంగా మారాయి. జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాల్లో శనివారం రాత్రికి 39 స్థానాలు, 38 ఎంపీపీలు ఏకగ్రీవమయ్యాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఏడు జెడ్పీటీసీలకుగాను ఏడూ వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవం కావడం విశేషం. పులివెందుల నియోజకవర్గంలో 65 ఎంపీటీసీ స్థానాలకుగాను 65 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అంతటా ఇదే ఊపు కనిపిస్తోంది. కమలాపురం నియోజకవర్గంలో 58 స్థానాలు ఉండగా 53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రొద్దుటూరులో 33 స్థానాలకుగాను 19 స్థానాలు ఏకగ్రీవం కాగా, మైదుకూరులో 61 స్థానాలకుగాను 53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బద్వేలు నియోజకవర్గంలో 58 స్థానాలు ఉండగా 44 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రైల్వేకోడూరులో 74 స్థానాలకుగాను 48 స్థానాలు, జమ్మలమడుగులో 66 స్థానాలకుగాను 15 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మాచర్లలో వైఎస్సార్‌సీపీ హవా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రికార్డు సాధించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు (ఒక్కటి మినహా) ఓటింగ్‌ నిర్వహించే పనిలేకుండానే నియోజకవర్గంలోని 71 ఎంపీటీసీ గాను 70 స్థానాలు, వెల్దుర్తి, మాచర్ల, కారంపూడి, రెంటచింతల, దుర్గి జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర్ల మున్సిపాలిటీలో సైతం 31 డివిజన్లకు గాను 31 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

– విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం చేసుకుంది. మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు పట్టు కలిగి ఉన్న సీతానగరం మండలం జెడ్పీటీసీ స్థానాన్ని సైతం వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

– శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి స్వగ్రామంలోనే ఎదురు దెబ్బ తగలింది. ఆయన స్వగ్రామమైన నార్తురాజుపాళెం–1 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోశింరెడ్డి అనిల్‌కుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఏ మాత్రం గెలిచే అవకాశం లేకపోవడంతో పరువు కోసం టీడీపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *