చిన్న కార్లు తయారీకి మారుతీ రంగం సిద్ధం

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వ్యూహాన్ని మార్చుకొంది. సెడాన్‌లు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీల పైనుంచి దృష్టిని చిన్న కార్లపైకి మళ్లించింది. చిన్నకార్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. జనవరిలో మారుతీ మొత్తం 1,79,103 కార్లను ఉత్పత్తి చేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2.1శాతం తక్కువ. కాకపోతే మారుతీ చిన్నకార్ల ఉత్పత్తిని పెంచి.. సెడాన్లు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కార్ల ఉత్పత్తిని తగ్గించింది. చిన్న కార్ల సెగ్మెంట్‌లో ఆల్టో, ఎస్‌ప్రెస్సోల వాటా దాదాపు 25.10శాతంగా ఉంది. అంటే 34,288 కార్లను ఈ జనవరిలో తయారు చేసింది.. గతేడాది ఇదే సీజన్‌లో వీటి సంఖ్య 27,408గా ఉంది. ఇక కాంపాక్ట్‌ కార్ల సెగ్మెంట్లోకి వచ్చే డిజైర్‌, స్విఫ్ట్‌, బాలినో, కొత్త వేగనార్‌ వంటి వాటి ఉత్పత్తి కూడా 6.31శాతం పెరిగింది.

మరోపక్క విటార బ్రెజా, ఎర్తిగా, ఎక్స్‌ఎల్‌6, ఎస్‌క్రాస్‌ వంటి మోడళ్ల ఉత్పత్తిలో 37.33శాతం తగ్గుదల కనిపించింది. విటారా బ్రెజా బీఎస్‌6 మోడల్‌ మార్కెట్లోకి వచ్చాక వీటి ఉత్పత్తిలో కూడా పెరుగుదల కనిపించవచ్చని కంపెనీ వర్గాలు అంటున్నాయ. ఎకోమోడల్‌ ఉత్పత్తిలో 9.78శాతం తగ్గుదల కనిపించింది. ఇక సూపర్‌క్యారీ వాణిజ్య వాహనం ఉత్పత్తి 45శాతం తగ్గింది. జనవరిలో మారుతీ విక్రయాలు కేవలం 1.7శాతం మాత్రమే వృద్ధిరేటును నమోదు చేశాయి. గతేడాది 1,42,150 వాహనాలు విక్రయించగా.. ఈ సారి 1,44,499 వాహనాలను విక్రయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *