చూతము రండి వంకాయల పాటి ఉమేష్ కథ

*బ్యాంకులకు 22 కోట్లు కట్టలేక దివాళ తీసిన‌సంస్థ ఇప్పుడు జెట్ ఎయిర్ వేస్ కొనుగోలు చేస్తుందట!!*

*ఆర్థిక సంక్షోభం తో‌ వందకోట్లు రావడమే గగనమైతే 1000కోట్లు బ్రిటన్ నుంచి తెస్తాడట!!*

తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త మోసానికి రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఆర్థికమాంద్యంతో విమానయాన సంస్థలు కొట్టుమిట్టాడుతుంటే… వందల కోట్ల రూపాయతో దేశ విమానయానాన్ని మారుస్తానంటూ ఓ ప్రబుద్ధుడు ముందుకు వచ్చాడు. ఇప్పటికే ప్రభుత్వ భూములను చౌకగా సొంతం చేసుకున్న వంకాయలపాటి ఉమేష్ అక్రమ లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.

*వంకాయ్ బురిడీ*

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలో కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లు ఏయిర్పోర్ట్ నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూములను టర్బో ఏవియేషన్ పేరుతో భూములను సొంతం చేసుకున్నా వంకాయలపాటి ఉమేష్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న బంధంతో ఏపిలో చాలాచోట్ల భూములను కబ్జా చేశారు. టర్బో కన్సర్టియం ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నెల్లూరు జిల్లాలో దగదర్తిలో గ్రీన్ఫీల్డ్ పేరిట వేలాది కోట్ల భూములను (జీవోఆర్టీ నం: 148, తేది-15-09-2017) స్వాహా చేశారు.

ఇక టర్బో ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న వంకాయలపాటి ఉమేశ్ సంస్థకు, ఓర్వకల్లు విమానాశ్రయం మేయిన్టెనెన్స్ పేరుతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి దాదాపు 28 లక్షల రూపాయలను (జీవోఆర్టీ 105, తేది: ఆగష్టు 2018) అప్పనంగా కట్టబెట్టింది. ప్రభుత్వ సొమ్ముతో జల్సాల చేసిన వంకాయలపాటి ఉమేష్ బ్యాంకుకు కూడా సున్నం పెట్టాడు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సిటీ బ్యాంక్కు కూడా దాదాపు మూడు కోట్ల రూపాయలు టర్బో ఏవియేషన్ పేరిటలోన్లు తీసుకొని ఎగ్గొట్టిన విషయాన్ని బహిరంగంగా ఆ బ్యాంక్ ప్రకటించింది.

ఇలా బ్యాంకులను, ప్రభుత్వాలను తన జిమ్మిక్కులతో మాయ చేసిన వంకాయలపాటి ఉమేష్ ఓ మాజీ ముఖ్యమంత్రి బినామీ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ మాజీ సీఎం కుటుంబాన్ని కూడా వంకాయలపాటి ఉమేష్ తెరపైకి తీసుకురాకుండా ఆ కుటుంబాన్ని విమానయాన వ్యాపారంలోకి తీసుకొచ్చాడు. తాజాగా విమానయాన పెట్టుబడులంటూ ఏపి, తెలంగాణాలో ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకొని నకిలీ ఏయిర్వేస్తో కొత్త దందాకు తెరలేపారు. దేశ వ్యాప్తంగా జీడిపి రేటు 5 శాతం దాటని నేపథ్యంలో యూకే పెట్టుబడులంటూ 980 కోట్ల రూపాయలతో ట్రూస్టార్ ఏయిర్వేస్ పేరుతో మరో కొత్త నాటకానికి తెరలేపారు. దేశంలో విమానయాన రంగంలో ముందజలో ఉన్న విస్తారా, స్పైస్జెట్, గో ఎయిర్, ఏయిర్ ఏషియా లాంటి సంస్థలు కూడా ఏవియేషన్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయి. అయితే వంకాయలపాటి ఉమేష్ మాత్రం 980 కోట్లతో జెట్ ఏయిర్వేస్ను ట్రూస్టార్గా మార్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది.

తాను పనిచేసిన సంస్థల పేర్లను అటు ఇటుగా మార్చి తన దందాకు మద్దతునిచ్చే ప్రభుత్వాలకు బినామీగా మారిన వంకాయలపాటి ఉమేష్ బాగోతాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *