చెర్రీ స్పెషల్ సాంగ్ ప్రోమో ఈ నెల 24న

ఈ నెల 27న మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టినరోజు కావడంతో అతని అభిమానులు ఇప్పటినుంచే బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో వెంక‌టాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, రాష్ట్ర చిరంజీవి యువ‌త జ‌న‌రల్ సెక్ర‌ట‌రీ శివ చెర్రీ ఇన్‌ఫినిటమ్‌ మీడియాతో క‌లిసి చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ స్పెష‌ల్ సాంగ్‌ను రూపొందిస్తున్నారు.

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ‘రామ్‌ కొ.ణి.దె.ల’ అంటూ సాగే ఈ బ‌ర్త్‌డే స్పెష‌ల్ సాంగ్‌ని స్కార్పియ‌న్ ఆల‌పించారు. పూర్తి పాటను మార్చి 24 సాయంత్రం 4 గంటలకు విడుద‌ల చేయ‌నున్నారు.

ఇక చిరంజీవి వార‌సత్వాన్ని పుణికిపుచ్చుకొని టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగిన రామ్ చ‌ర‌ణ్‌ ప్రస్తుతం ఎస్‌.ఎస్‌.రాజమౌలి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌ర‌గ‌గా, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *