జయప్రద కు నాన్ బెయిల్ బుల్ వారెంట్

సీనియర్ హీరోయిన్.. తెలుగు, హిందీ సహా మరో నాలుగైదు భాషల్లో వందల సినిమాల్లో నటించిన సీనియర్ హీరోయిన్, మాజీ ఎంపీ, బిజేపీ లీడర్ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాంపూర్ కోర్టు ఈమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల్లో జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పోలీసులు పెట్టిన కేసులో రాంపూర్ కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్ ఇష్యూ చేసింది. గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జయప్రద బీజేపీ అభ్యర్థినిగా రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. అయితే సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజం ఖాన్ చేతిలో ఈమె లక్ష ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. జయప్రదపై నమోదైన మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఉల్లంఘన కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20వ తేదీన జరగనుంది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *