జేసీ సోదరులకు జైలు భయం!!

జేసీ బ్రదర్స్ కి జైలు భయం పట్టుకుంది. గతంలో జరిగిన తప్పులు తమనెక్కడ వెంటాడతాయోనని బెంగ పట్టుకుంది. వారు చేసిన ఒక్కో అక్రమం వెలుగుచూస్తుండగా జైలు భయంతో అన్నదమ్ములిద్దరూ ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే బీఎస్‌–3 వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బీఎస్‌–4 వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించిన జేసీ సోదరులు.. వాటిని ఇతరులకు అంటగట్టి భారీగా వెనకేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవహారం వెలుగుచూడగా.. బాధితులు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు.

తుక్కులారీల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో జేసీ సోదరులు కాళ్ల బేరానికి దిగినట్టు తెలుస్తోంది. కేసులు పెట్టవద్దంటూ తమ నుంచి లారీలు కొన్న వారిని వేడుకుంటున్నట్టు సమాచారం.

ఇందులో భాగంగా తాము విక్రయించిన తుక్కు లారీలను వెనక్కి తీసుకుని సదరు యజమానులకు లారీకి రూ.14 లక్షల చొప్పున ముట్టచెబుతున్నారు.అంతేకాకుండా తమ మీద కేసులు పెట్టకుండా రూ.100 బాండ్‌ పేపరు మీద వారితో సంతకాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *